Share News

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

ABN , Publish Date - May 27 , 2025 | 11:18 PM

సమాజా నికి కమ్యూనిస్టులు ఎంతో అవసరమని, పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసేది ఏకైక పార్టీ ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు బాలనర్సింహ అన్నారు.

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలనర్సింహ

చారకొండ, మే 27 (ఆంఽద్రజ్యోతి) సమాజా నికి కమ్యూనిస్టులు ఎంతో అవసరమని, పేదల పక్షాన నిరంతరం పోరాటం చేసేది ఏకైక పార్టీ ఎర్రజెండా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యుడు బాలనర్సింహ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో చారకొండ, వంగూరు ఉమ్మ డి మండలాల సీపీఐ 3వ మహాసభల సమావే శం సీపీఐ మండల కార్యదర్శి ఏసారపు అశోక్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. మతోన్మాద బీజేపీ క మ్యూనిస్టులపై నిరంకుశ పాలన కొనసాగిస్తోం దని, వెంటనే వీటిని నిలువరించేందుకు కమ్యూ నిస్టులు ఐక్యతో పోరాటం చేయాలని అన్నారు. ఆదివాసి ప్రజలను, మావోయిస్టులను చట్ట విరు ద్ధంగా హత్యలు చేయడాన్ని తీవ్రంగా కండిస్తు న్నామని, ఈ హత్యలన్నీ బీజేపీ చేసిన హత్యలే నని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు వార్ల వెంకటయ్య, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు డాక్టర్‌ చిలివేరు శ్రీనివాసులు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకు లు నూనే వెంకటేష్‌, గోపాల్‌, మల్లేష్‌, తిరుపతమ్మ, పరశు రాం పాల్గొన్నారు.

ఫ కందనూలు : హామీ లు అమలు చేయకపోతే పో రాటం తప్పదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చ్‌.ఆనం ద్‌జీ అన్నారు. నాగర్‌కర్నూల్‌ మండలంలోని మంగళవారం కుమ్మెర గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ మహా సభ సీతారాములు అధ్యక్షతన జరిగింది. జిల్లా సమితి సభ్యుడు కృష్ణాజీతో కలిసి హెచ్‌.ఆనంద్‌ జీ పాల్గొన్నారు. నూతన కమిటీని ఎన్నుకు న్నారు. గ్రామ శాఖ కార్యదర్శిగా బౌరమ్మ, సహా య కార్యదర్శిగా కాజా, కోశాధికారిగా సీతారాములును ఎన్నుకున్నారు.

ఫ తెలకపల్లి : ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకోబోమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కేశవులుగౌడ్‌ హె చ్చరించారు. గతంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలకు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. మంగళవారం మండ లంలోని గట్టురాయిపాకుల సీపీఐ మహాసభ జరగగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. మండలంలోని పెద్దపల్లి, గౌరెడ్డిపల్లి, గట్టురాయిపాకుల గ్రామాల్లో ప్రజా స్థానిక సం స్థల సీపీఐ అభ్యర్థులుగా పోటీ చేయిస్తామన్నా రు. కార్యక్రమంలో సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్‌, సీపీఐ మండల కార్యదర్శి రవీందర్‌, గొడుగు విష్ణు, షర్ఫుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:18 PM