మంచిర్యాలలో శాంతి భద్రతలు కాపాడాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:24 PM
మంచిర్యాల నియోజక వర్గంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి శాంతి భద్రతలను కాపాడాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు నడిపెల్లి విజిత్ కుమార్ కోరారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్ కుమార్
నస్పూర్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల నియోజక వర్గంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి శాంతి భద్రతలను కాపాడాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు నడిపెల్లి విజిత్ కుమార్ కోరారు. నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మంచిర్యాలలో మంచి అనే విధానం చెదిరిపోయిందని, గుండాయిజం, అవినీతి, అక్రమాలు కొన సాగుతున్నయన్నారు. సీసీసీ కార్నర్‌లో ఫ్లెక్సీల వివాదం, పోలీస్ స్టేష న్ ఎదుట జరిగిన సంఘటనలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపైనే అక్రమ కే సులు పెట్టారన్నారు. పోలీస్ స్టేషన్ వద్దనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్ నాయకులపై దౌర్జన్యం చేసి కొట్టినా పట్టించుకోలేదన్నారు. అధికా ర పార్టీ నాయకులు చెప్పినట్లు పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నా యకులపై కేసులు పెట్టారన్నారు. యూత్ విభాగం నాయకుడు కాటం రాజును తీవ్రంగా కొట్టారని, తమపై దాడి చేసారని ఫిర్యాదు చేసిన పోలీసుల స్పందన నామ మాత్రంగా ఉందన్నారు. జరిగిన ఘటనలపై విచారణ జరిపించి నియోజక వర్గంలో శాంతి భద్రతలను కాపా డాలని విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు వంగ తిరుపతి, పవన్ కుమార్, కాటం రాజు, రఫీక్, రాంచందర్, సత్తయ్య, మోహన్, గరిసె భీమయ్య, దగ్గుల మధు, తిరుపతి, జనార్ధన్ పాల్గొన్నారు.
ఫకాంగ్రెస్ నాయకుల దాడికి గురైన బీఆర్‌ఎస్ యూత్ విభాగం నాయకుడు కాటం రాజును గురువారం నస్పూర్‌లో నడిపెల్లి విజిత్ కుమార్ పరామర్శించారు. ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.