పెండింగ్ బిల్లులు చెల్లించండి
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:20 PM
మండలలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాలోని పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల బిల్లులను చెల్లించాలని నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురా లు శ్రీదేవి కోరారు. శనివారం దండేపల్లిలో మండల విద్యా వనరుల కేంద్రం లో ఎంఈవో మంత్రి రాజుకు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఎంఈవోకు నిర్వాహకుల వినతి
దండేపల్లి అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలలోని ప్రభుత్వ ఉన్నత పా ఠశాలోని పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల బిల్లులను చెల్లించాలని నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షురా లు శ్రీదేవి కోరారు. శనివారం దండేపల్లిలో మండల విద్యా వనరుల కేంద్రం లో ఎంఈవో మంత్రి రాజుకు కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం మధ్యాహ్నం వంట చేసి పెడుతున్నామన్నారు. ఆరు నెలల నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా త మకు బిల్లులు రావడం లేదన్నారు. దీంతో శనివారం నుంచి ప్రభుత్వ ఉన్న త పాఠశాలోని మధ్యాహ్న భోజనం వండకుండా విధులను బహిష్కరిస్తు న్నామన్నారు. తమకు ఆరు నెలల పెండింగ్ బిల్లులు వచ్చే వరకు పాఠ శాలలో వంట చేయకుండా బంద్ పాటిస్తున్నామన్నారు. ఇప్పటికైన ప్రభు త్వం, అధికారులు స్పందించి తామకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చె ల్లించే విధంగా చూడాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశామన్నారు. కా ర్యక్రమంలో నిర్వాహకులు మల్లేశ్వరీ, రమాదేవి, రాజేశ్వరీ, లక్ష్మి, శంకరవ్వ, జమున, పుష్పలత, మధనమ్మ, పుష్పల, అంజిబాయి పాల్గొన్నారు.