సాగులో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:30 PM
కోటపల్లి మండలంలోని సర్వాయి పేట గ్రామ రైతులు 72 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు వెంటనే ప్రభు త్వం పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం చెన్నూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్
చెన్నూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : కోటపల్లి మండలంలోని సర్వాయి పేట గ్రామ రైతులు 72 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు వెంటనే ప్రభు త్వం పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం చెన్నూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వ హించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 నుంచి 1974 వరకు పట్టా లోపల ఉన్న సుమారు 15 మంది పట్టాదారుల వారసులు 240 ఎకరాల భూమిని ఏళ్లుగా అనుభవిస్తున్నారని కానీ అప్పటి మక్తదారులు కొందరు రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకుని 1972లో కొంత మంది పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ పట్టాలు మార్పిడి చేయించు కున్నారన్నారు. కానీ ఏన్నడు కూడా ఆ పట్టాదారులు భూమి అనుభవిం చ డం కానీ దున్నడం కానీ చేయలేదన్నారు. వెంటనే మోకా సర్వే చేయించి 1952 నాటి పట్టాదారుల వారసులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, కోట పల్లి మండల నాయకులు పున్నంచంద్, రామయ్య, నాగేశ్వర్‌రావు, నర్సింహులు, వెంకటేష్, శ్రీపాల్, శ్రీనివాస్, వెంకట నర్సయ్య పాల్గొన్నారు.