Share News

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:39 PM

ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం పీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీవో పాఠశాల రికార్డులను తరగతి గదులను పరిశీలించారు.

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జైనూర్‌ ఆశ్రమ పాఠశాలలో రిజిస్టర్‌ తనిఖీ చేస్తున్న ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా

జైనూర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం పీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీవో పాఠశాల రికార్డులను తరగతి గదులను పరిశీలించారు. పీవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలన్నారు. విద్యా రంగం బలోపేతం దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. వసతి గృహలలో విద్యార్థులకు ఆవసరమైన సదుపాయాలు కల్పించి మెరుగైన విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజన సదుపాయం కల్పించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా విద్యార్థులకు డెంగీ, మలేరియా, వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహల పరిసర ప్రాంతంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. చెత్తాచెదారం నిత్యం తొలగించేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంట శాలలు, మూత్ర శాలలు పరిశుభ్రంగా ఉండేల చూడాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచిచారు. కార్యక్రమంలో వైద్యులు అశోక్‌, వెంకన్న, హెచ్‌ఎం పార్వతీబాయి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 10:40 PM