Share News

Passenger Returns Lost Gold: బస్సులో దొరికిన 39 తులాల బంగారం అప్పగింత

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:03 AM

బస్సులో దొరికిన సుమారు 50 లక్షల విలువ గల 39 తులాల బంగారాన్ని బాధితులకు అప్పగించి ఓ ప్రయాణికుడు నిజాయితీ చాటుకున్నాడు...

Passenger Returns Lost Gold: బస్సులో దొరికిన 39 తులాల బంగారం అప్పగింత

  • నిజాయితీ చాటుకున్న ప్రయాణికుడు.. బాధితుల కృతజ్ఞతలు

సంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బస్సులో దొరికిన సుమారు 50 లక్షల విలువ గల 39 తులాల బంగారాన్ని బాధితులకు అప్పగించి ఓ ప్రయాణికుడు నిజాయితీ చాటుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బీఎ్‌సఎన్‌ఎల్‌ విశ్రాంత ఉద్యోగి వసుధ, ప్రకాశ్‌ దంపతులు తమ మనవరాలి వివాహం కోసం గురువారం సికింద్రాబాద్‌లో 39 తులాల బంగారం కొనుగోలు చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఇంటికి వెళ్లి చూడగా బంగారు బిస్కెట్లతో కూడిన పర్సు లేకపోవడాన్ని గమనించారు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి డీఎంకు ఫిర్యాదు చేశారు. అయితే అదే బస్సులో ప్రయాణించిన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కోరంపల్లికి చెందిన దుర్గయ్యకు ఆ పర్సు లభించింది. అతడు వెంటనే కండక్టర్‌ ద్వారా సంగారెడ్డి డిపో మేనేజర్‌ ఉపేందర్‌కు పర్సును చేరవేశాడు. పోగొట్టుకున్న బంగారం వారిదే అని సంబంధిత బిల్లుల ద్వారా నిర్ధారించుకున్న అధికారులు దానిని బాధితులకు అందజేశారు. మానవత్వాన్ని చాటుకున్న ప్రయాణికుడు దుర్గయ్యను ఆర్టీసీ డీఎం ఉపేందర్‌ సన్మానించారు. బంగారం అప్పగించిన దుర్గయ్యతో పాటు, ఆర్టీసీ అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 02:03 AM