పార్టీల రిజర్వేషన్లు అంగీకరించం
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:46 PM
చట్టం లేకుండా పార్టీల పరంగా ఇచ్చే రిజర్వేషన్లను యావత్ తెలంగాణ బీసీ సమాజం అంగీకరించదని బీసీ జేఏసీ జిల్లా నాయకుడు మ్యాకల శివశంకర్ యాదవ్ అన్నారు.
- బీసీ జేఏసీ జిల్లా నాయకుడు మ్యాకల శివశంకర్‌యాదవ్
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : చట్టం లేకుండా పార్టీల పరంగా ఇచ్చే రిజర్వేషన్లను యావత్ తెలంగాణ బీసీ సమాజం అంగీకరించదని బీసీ జేఏసీ జిల్లా నాయకుడు మ్యాకల శివశంకర్ యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్లకా ర్డులతో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ గుర్తుల్లేని ఎన్నికల్లో పార్టీ పరంగా నిజర్వేషన్లు ఇవ్వడమంటే బీసీలకు భిక్షం ఇచ్చినట్లేనని, ఈ అవమానాన్ని బీసీ సమాజం భరించదని పేర్కొ న్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా నాయ కులు దాసర్ల వెంకటస్వామి, కుంభం మల్లేష్ గౌడ్, అరవింద్‌చారి, కాశీంయాదవ్, రాజేందర్ గౌడ్, సత్యశీలసాగర్, కరుణాకర్, యాదయ్య, సుధాకర్, నిరంజన్, రఘుబాబు, బీఎస్పీ కళ్యాణ్, సీపీఐ శివశంకర్, సీపీఎం ఆర్.శ్రీనివా సులు, సాయిమహరాజ్ పాల్గొన్నారు.