Share News

రైతాంగ పోరాటంలో మహామహుల భాగస్వామ్యం

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:29 PM

ఆనాడు నిజాం పాలనకు వ్యతి రేకంగా కొనసాగిన రైతాంగ, సాయుధ పోరాటంలో మహామహుల భాగ స్వామ్యం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అ న్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా శ్రీరాంపూర్‌లోని కటిక దుకాణాల నుంచి బస్టాండ్‌ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.

రైతాంగ పోరాటంలో మహామహుల భాగస్వామ్యం
జెండా ఎగురవేస్తున్న నాయకులు

శ్రీరాంపూర్‌, సెప్టెంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి) : ఆనాడు నిజాం పాలనకు వ్యతి రేకంగా కొనసాగిన రైతాంగ, సాయుధ పోరాటంలో మహామహుల భాగ స్వామ్యం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్‌ అ న్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా శ్రీరాంపూర్‌లోని కటిక దుకాణాల నుంచి బస్టాండ్‌ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. హి మ్మత్‌నగర్‌ సెంటర్‌ వద్ద సీనియర్‌ నాయకుడు నూకల రాజయ్య సీపీఐ జెం డాను ఆవిష్కరించారు. అనంతరం కలవేన శంకర్‌ మాట్లాడుతూ, మహ త్తర పోరాటానికి రావి నారాయణరెడ్డి, దొడ్డి కొమురయ్య నాయకత్వం వ హించా రన్నారు. వారి పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాలను భూమి లేని పేద లు పొందారని అన్నారు. ఈ ఉద్యమానికి సంబంధం లేని బీజేపీ తన చరి త్రగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌, నాయకులు మేకల దాసు, జోగుల మల్లయ్య, జోగుల మ ల్లయ్య, లింగం రవి, షేక్‌ బాజీసైదా, పూజారి రామన్న, మిరియాల రాజేశ్వర్‌ రావు, కొట్టె కిషన్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:29 PM