kumaram bheem asifabad- తల్లిదండ్రుల పోషణ బాధ్యతగా భావించాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:03 PM
వయో వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమం పిల్లల బాధ్యతగా భావించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వయోవృద్దులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన, అవగాహన సదస్సులో మాట్లాడారు.
ఆసిఫాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వయో వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమం పిల్లల బాధ్యతగా భావించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా మహిళా శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వయోవృద్దులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన, అవగాహన సదస్సులో మాట్లాడారు. వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సక్షేమం ప్రతి ఒక్కరీ బాధ్యత అన్నారు. మొదటగా మనలో మార్పు వస్తే ఇతరులలో మార్పు తీసుకు రావచ్చని చెప్పారు. తల్లిదండ్రులు, పెద్దలపై గౌరవభావం కలిగి ఉండాలని సూచించారు. యువత ప్రస్తుతం మత్తు పదార్థాలకు బానిసలై క్షణికావేశంలో నేరాలు చేస్తున్నారని అన్నారు. ఆస్తుల కోసం కన్న వారిని, తోడబుట్టిన వారిని హాని చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో తల్లిదండ్రులను సరిగ్గా పోషించని కుమారులు, కూతుళ్లపై 28 కేసులు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేశామని అన్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మార్పునకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆసిఫాబాద్ డివిజన్‌లో ఆర్‌డీవో, కాగజ్‌నగర్ డివిజన్‌లో సబ్‌కలెక్టర్ స్థాయి వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టం ప్రకారం ట్రిబ్యునల్ పని చేస్తున్నాయని తెలిపారు. అనంతరం గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, జూనియర్ జడ్జి అనంతలక్ష్మి, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.