Share News

Family Dispute: ప్రేమ వివాహం నచ్చక..

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:24 AM

కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవటం నచ్చక.. సొంత కూతురుని అత్తారింటి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది...

Family Dispute: ప్రేమ వివాహం నచ్చక..

  • కుమార్తెను ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన తల్లిదండ్రులు

కీసర రూరల్‌, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవటం నచ్చక.. సొంత కూతురుని అత్తారింటి నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన మేడ్చల్‌ జిల్లా కీసర పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపల్లికి చెందిన ప్రవీణ్‌, శ్వేతలు మూడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. ప్రవీణ్‌ తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భార్యతో కలిసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం ప్రవీణ్‌ ఇంటిపై దాడి చేశారు. ముందస్తు పథకం ప్రకారం ప్రవీణ్‌తో పాటు అతని సోదరుడు, తల్లి కళ్లల్లో కారం చల్లి అందరినీ కర్రలతో చితకబాదారు. కుమార్తెను ఈడ్చుకుంటూ లాక్కెల్లి కారులో తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో గాయాల పాలైన ప్రవీణ్‌ తల్లిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Sep 25 , 2025 | 04:24 AM