Share News

పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:33 PM

బడుగు బలహీనవర్గాల కోసం కృషి చేసిన సర్దార్‌ పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కవ్వాల్‌ గ్రామంలో గల సర్వాయిపాపన్న విగ్రహానికి పూల మాలలు వేశారు.

పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
మాట్లాడుతున్న ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌

జన్నారం, ఆగస్టు24 (ఆంధ్రజ్యోతి): బడుగు బలహీనవర్గాల కోసం కృషి చేసిన సర్దార్‌ పాపన్న గౌడ్‌ ఆశయ సాధనకు అనుగుణంగా పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌ అన్నారు. ఆదివారం మండలంలోని కవ్వాల్‌ గ్రామంలో గల సర్వాయిపాపన్న విగ్రహానికి పూల మాలలు వేశారు. కవ్వాల్‌ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయిపాపన్న గౌడ్‌ జ యంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. కవ్వాల గ్రామంలో గౌడ సంఘం ఆద్వర్యంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మత్తడి కాల్వతో పలు అభివృధ్ది పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో నాయకులు కాసారపు పోచాగౌడ్‌, బాలా గౌడ్‌, భాస్కర్‌ గౌడ్‌, మా ర్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు ముజాఫర్‌ అలీ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు సత్యగౌడ్‌, తిరుపతి, మత్స్య శంకరయ్య, మోహన్‌ రెడ్డి, కేశవరావు, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:33 PM