kumaram bheem asifabad- పంచాయతీలకు గూడు కరువు
ABN , Publish Date - Dec 07 , 2025 | 10:59 PM
జిల్లాలో పలు చోట్ల కొత్తగా గెలిచే సర్పంచ్‌లకు పాలన పగ్గాలు చేపట్టేందుకు సొంత భవనాలే కరువయ్యాయి. పలు చోట్ల పాఠశాలలు, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నా యి. దీంతో పంచాయతీ సమావేశాలు నిర్వహించేం దుకు పాలవర్గ సభ్యులు అవస్థలు పడుతున్నారు.
- మహిళలకూ తప్పని అవస్థలు
- నిధులు మంజూరైనా స్థలాల కొరత
- కొత్త పాలకవర్గాలపైనే భారం
జిల్లాలో పలు చోట్ల కొత్తగా గెలిచే సర్పంచ్‌లకు పాలన పగ్గాలు చేపట్టేందుకు సొంత భవనాలే కరువయ్యాయి. పలు చోట్ల పాఠశాలలు, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నా యి. దీంతో పంచాయతీ సమావేశాలు నిర్వహించేం దుకు పాలవర్గ సభ్యులు అవస్థలు పడుతున్నారు.
బెజ్జూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. బరిలో నిలిచిన అబ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం ఆయా అభ్యర్థులకు పరీక్షగా మారింది. అద్దె, ఇతర భవనాల్లో అరకొర వసతుల మధ్య కొత్త పాలకవర్గా లకు స్వాగతం పలక నుండడం వారికి ఆరంభంలోనే అవస్థలకు గురి చేయనున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల సరిపడా స్థలం లేక సమావేశాలు రచ్చబండ వద్ద, చెట్లకింద నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వరకు ఉన్న పంచాయతీలకు కొంత ఇబ్బంది లేకపోయినా ఆరేళ్ల కిందట ఏర్పడిన పంచాయతీ లకు సొంత గూడు కరువైంది. ఉపాధిహామీ నిధుల కింద ఒక్కో భవనానికి రూ.20లక్షలు మంజూరు చేసినా బిల్లులు సకాలంలో రావనే భావనతో కాంట్రా క్టర్లు పనులు చేపట్టేందుకు నిరా సక్తత ప్రదర్శించడం సర్పంచ్‌లు చొరవ తీసుకున్న చోట నిధులు రాక పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
- జిల్లాలో పరిస్థితి ఇలా..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 335గ్రామ పంచాయతీలు ఉండగా, జిల్లాలోని 52 గిరిజన పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఒక్కో దానికి రూ.20లోల చొప్పున నిధులు మంజూరయ్యాయి. వీటిలో కొన్నింటికి స్థలాల కొరతతో పనులు ప్రారంభించ లేదు. ప్రారం భమైన చోట తదుపరి బిల్లులు రాక అర్దంతరంగానే నిలిచిపోయాయి. రెండేళ్లు కావస్తున్నా నిధులు రాక అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో ఆయా పంచాయ తీల్లో పాలక వర్గాలకు సమావేశాలు నిర్వహించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది.
- కొత్తగా 162 ఏర్పాటు..
జిల్లాలో 162కొత్తగా ఏర్పాటయ్యాయి. పాత పం చాయతీలు శిథిల భవనాల్లో కొనసాగు తుండగా, కొత్తగా ఏర్పడ్డవి ఐదేళ్లు గడిచినా సొంత భవనాల కు నోచుకోలేదు. దీంతో చాలా పంచాయతీలు పాఠశాల భవనాలు, ఇతర వాటిల్లో కొనసాగుతు న్నాయి. వీటిలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో అధికారులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళా అధికా రులు, సర్పంచులు ఉన్నచోట ఇబ్బందు లు అనేకం. మరోవైపు కార్యాలయానికి తగ్గట్లుగా భవనాలు లేక, సమావేశాల నిర్వహణ, రికార్డులు, సామగ్రి భద్రతకు రక్షణ లేకుండా పోయింది. పంచాయ తీలు ఏర్పడి ఇన్నేళ్లు కావస్తున్నా భవనాలు ఎప్పు డు నిర్మిస్తారంటూ గామ్రాల జ్రలు ప్రశ్నిస్తున్నారు.
- దశాబ్దాల క్రితం ఏర్పాటైన వాటికీ..
దశాబ్దాల కిందట ఏర్పడిన గ్రామాలదీ ఇదే పరిస్థితి. పలుచోట్ల భవనాలు శిథిలా వస్థకు చేరు కున్నాయి. మరికొన్ని పాఠశాలలు, ఇతర భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో పల్లె పాలనకు ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఇక రాష్ట్రంలో పంచా యతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో జోరుగా ప్రచారం కూడా కొనసాగుతోంది. మరో పది రోజుల్లో కొత్త పాలకవర్గాలు ఏర్పడుతు న్న నేపథ్యంలో వా రికి సవాళ్లు దర్శనమిస్తున్నాయి. కొత్తగా కొలువుతీరే పాలకవర్గాలైనా భవనాల నిర్మా ణాల ఏర్పాటుకు పాటుపడాలని ప్రజలు కోరుతు న్నారు.