Share News

ముగిసిన పంచాయతీ నామినేషన్లు...

ABN , Publish Date - Dec 05 , 2025 | 11:39 PM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టం నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పంచా యతీ ఎన్నికలను మొత్తం మూడు విడుతల్లో నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణికు మదిని గత నెల 25వ తేదీన షెడ్యూల్‌ విడుదల చేశా రు. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్సరం జన వరిలో ముగియగా, 20 నెలల సుదీర్ఘ సమయం తరు వాత ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.

ముగిసిన పంచాయతీ నామినేషన్లు...

-మూడు విడుతల్లో ఎన్నికల నిర్వహణ

-ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

-గ్రామాల్లో ముమ్మరం కానున్న ప్రచారం

-ఈనెల 11,14,17 తేదీల్లో పోలింగ్‌

మంచిర్యాల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమైన ఘట్టం నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పంచా యతీ ఎన్నికలను మొత్తం మూడు విడుతల్లో నిర్వహిం చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణికు మదిని గత నెల 25వ తేదీన షెడ్యూల్‌ విడుదల చేశా రు. గ్రామ పంచాయతీల పాలన గత సంవత్సరం జన వరిలో ముగియగా, 20 నెలల సుదీర్ఘ సమయం తరు వాత ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జిల్లాలో 306 సర్పంచ్‌ స్థానాలతోపాటు వాటి పరిధిలోగల 2680 వా ర్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్‌ స్థానా ల్లో బీసీలకు 23, ఎస్సీలకు 117, ఎస్టీలకు 29, జనరల్‌కు 137 స్థానాలను కేటాయించారు. అలాగే వార్డు సభ్యుల్లో స్థానాల్లో ఎస్సీలకు 803, ఎస్టీలకు 253, బీసీలకు 334, జనరల్‌ కేటగరీకి 1290 స్థానాలకు కేటాయించారు.

మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ....

గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం మూడు వి డతల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొద టి విడుత ఎన్నికలు మంచిర్యాల నియోజక వర్గం పరి ధిలోని హాజీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మం డలాల్లో ఈ నెల 11వ తేదీన నిర్వహించనుండగా, నా మినేషన్లను గత నెల 27 నుంచి 29న తేదీ వరకు స్వీకరించారు. అలాగే రెండో విడుత ఎన్నికలు బెల్లంపల్లి నియోజక వర్గం పరిధిలోని బెల్లంపల్లి, తాండూరు, నెన్నె ల, భీమిని, వేమనపల్లి, కన్నెపల్లి, కాసిపేట మండలాల్లో ఈ నెల 14న నిర్వహించనుండగా, నామినేషన్లను గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు స్వీకరించారు. ఇక మూడో విడుత ఎన్నికలు చెన్నూరు నియోజకవ ర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్‌, మం దమర్రి మండలాల్లో ఈ నెల 17న నిర్వహించనుండగా, ఇదే నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

రెండు విడుతల్లో 5,479 నామినేషన్లు...

పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని మొదటి రెండు విడుతల్లో మొత్తం 204 పంచాయతీల్లోని 1812 వార్డులకు నామినేషన్లు స్వీకరించగా, సర్పంచ్‌ స్థానాల కు 1,276, వార్డు సభ్యుల స్థానాలకు 4203 నామిేషన్లు దాఖలయ్యాయి. మూడో విడుతలో చెన్నూరు నియోజ క వర్గంలోని 102 గ్రామ పంచాయతీలు, 868 వార్డు స భ్యుల ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 2 నుం చి 5వ తేదీ వరకు కొనసాగింది. మూడో విడుతలో మొ త్తం 102 సర్పంచ్‌ స్థానాలు, 868 వార్డు సభ్యుల స్థానా లకు దాఖలైన నామినేషన్ల సంఖ్య తేలాల్సి ఉంది.

ఆరు పంచాయతీలు ఏకగ్రీవం...

జిల్లాలో మొదటి విడుతలో భాగంగా మొత్తం ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మంచిర్యాల ని యోజక వర్గంలోని దండేపల్లి మండలం ముత్యంపేట, కొత్త మామిడిపల్లి, పాత మామిడిపల్లి, కొండాపూర్‌ స ర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే జన్నారం మండలంలో లింగయ్య పల్లె, లోతొర్రె గ్రామ పంచాయ తీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పంచాయతీల్లో కేవ లం ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో అధికా రులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. లక్షెట్టిపేట, హాజీ పూర్‌ మండలాల్లో ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేసినప్ప టికీ, చివరి నిమిషంలో బెడిసి కొట్టడంతో ఎన్నికలకు వె ళ్లక తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడు తలో భాగం బెల్లంపల్లి నియోజకవర్గంలో నామినేషన్ల విత్‌ డ్రా గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఉంది. చె న్నూరు నియోజకవర్గంలో ఉప సంహరణ గడువు ఈ నెల 9వ తేదీ వరకు ఉంది. కాగా పై రెండు నియోజక వర్గాల్లోనూ పెద్ద మొత్తంలో పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతా ల్లో నామినేషన్ల ఉప సంహరణ పూర్తయితే తప్ప... ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయో చెప్పలే ని పరిస్థితి ఉంది.

Updated Date - Dec 05 , 2025 | 11:40 PM