kumaram bheem asifabad- ముగిసిన పంచాయతీ పోరు
ABN , Publish Date - Dec 17 , 2025 | 11:59 PM
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం జరిగిన తుది విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది.జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్‌నగర్ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగలేదు.
- నాలుగు మండలాల్లో పోటెత్తిన ఓటర్లు
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఐజీ, కలెక్టర్, ఏఎస్పీలు
- 83.32 శాతం పోలింగ్ నమోదు
- 104 పంచాయతీల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 1,00,815 మంది ఓటర్లు
ఆసిఫాబాద్, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా బుధవారం జరిగిన తుది విడత ఎన్నికల పోలీంగ్ ప్రశాంతంగా జరిగింది.జిల్లాలో తుది విడత 108 గ్రామ పంచాయతీ సర్పంచులు, 938 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే కాగజ్‌నగర్ మండలంలోని రేగుల గూడ, చింతగూడ రెండు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు , 186 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.ఆసిఫాబాద్ మండలంలోని రహపల్లి , చిలాటి గూడ గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఆ రెండు స్థానాల్లో నామినేషన్లు ఽధాఖలు కాకపోవడంతో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగలేదు. దీంతో బుధవారం 104 సర్పంచ్, 744 వార్డు స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,00,815 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా జిల్లాలో చలి తీవ్రత కారణంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా జరిగింది. ఆ తర్వాత పుంజుకుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 18.95 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటల వరకు 55.99 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 80.83 శాతం పోలింగ్ నమోదు కాగా పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూలైన్‌లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగ జిల్లాలో మొత్తం 83.32 శాతంగా పోలింగ్ నమోదైంది .జిల్లాలో అత్యధికంగా రెబ్బెన మండలంలో 85.64 శాతం పోలీంగ్ నమోదు కాగా, అత్యల్పంగా కాగజ్‌నగర్ మండలంలో 81.03 శాతం పోలీంగ్ నమోదైంది. ఆసిఫాబాద్ మండలంలో 29731 మంది ఓటర్లకు గాను 25199 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెబ్బెన మండలంలో 28724 మందికి గాను 24599 మంది, తిర్యాణి మండలంలో 18148 మందికి గాను 15039 మంది, కాగజ్‌నగర్ మండలంలో 44401 మందికి గాను 35978 మంది, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పలు మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే,్ల ఏఎస్పీ చిత్తరంజన్, అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్ , సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్‌లు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు.
రెబ్బెనలో 86 శాతం పోలింగ్
రెబ్బెన, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలంలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల వ్యాప్తంగా 86 శాతం పోలింగ్ నమోదు అయింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ముఖయంగా ధర్మారంలో 97 శాతం, గంగాపూర్‌లో 90 శాతం, గోలేటిలో 75 శాతం, ఇందిరానగర్‌లో 93 శాతం, జకుకలపల్లిలో 91 శాతం, కైరిగాంలో 90 శాతం, కైరిగూడలో 93 శాతం, కిష్టాపూరలో 89 శాతం, కొమురవెల్లిలో 92 శాతం, కొండపల్లిలో 94 శాతం, లక్ష్మిపూర్‌లో 90 శాతం, మాధవాయిగూడలో 93 శాతం, నంబాలలో 95 శాతం, నారాయణపూరలో 84 శాతం, నవేగాంలో 91 శాతం, పాసిగాంలో 88 శాతం, పులికుంటలో 91 శాతం, రాజారాంలో 90 శాతం, రాంపూర్‌లో 90 శాతం, రెబ్బెనలో 76 శాతం, రోళలపాడులో 92 శాతం, తక్కళ్లపల్లిలో 95 శాతం, తుంగడలో 90 శాతం, వంకులంలో 90 శాతం ఓటింగ నమోదు కావడం జరిగంది. గోలేటి పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులు సందర్శించారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్‌కుమార, ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఎన్నికల కేంద్రాలను పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టారు. గోలేటి ఎన్నికల కేంద్రాన్ని మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పాటు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సందర్శించారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ మండలంలో పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 198 వార్డు స్థానాల పరిధిలోని మొత్తం 29,731 మంది ఓటర్లు ఉండగా 25,199 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా 84.76 శాతం నమోదైంది. మండలంలోని మోతుగూడ పోలింగ్ కేంద్రాన్ని ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. అలాగే సాలేగూడ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లు మోతుగూడ, అంకుశపూర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అలాగే ఏఎస్పీ చిత్తరంజన్ తుంపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ శ్యాంనాయక్‌లు తమ ఓటు హక్కును రాజంపేట పోలింగ్ వినియోగించుకున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ పోలింగ్ కేంద్రంలో గురుశిష్యుల కలయిక జరిగింది. 2001లో బెల్లంపల్లి బజారుఏరియా ఉన్నత పాఠశాలలో అబ్దుల్ లతీఫ్ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. అప్పుడు 10వ తరగతిలో కమలాకర్, నాగర్జున చదువుకుంటున్నారు. ప్రస్తుతం లతీఫ్ రెబ్బెన హెచ్‌ఎంగా పని చేస్తుండగా తన శిష్యులైన కమలాకర్ ఆసిఫాబాద్ ఎస్సైగా, నాగర్జున తిర్యాణి మండలంలో బీట్ అధికారిగా పని చేస్తున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా లతీఫ్‌కు మోతుగూడ పీవోగా విదులు నిర్వహిస్తుండగా ఎస్సై కమాలకర్, బీట్ అధికారి నాగర్జునలు సైతం అదే కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. రెండున్నర దశాబ్దల తర్వాత గురు శిష్యులు ఒకే పోలింగ్ కేంద్రంలో విఽధుల నిర్వహణలో కలుసుకొవడం చర్చనీయంశంగా మారింది.