Share News

kumaram bheem asifabad-పంచాయతీ ఎన్నికలతో పార్టీల్లో జోష్‌

ABN , Publish Date - Dec 28 , 2025 | 10:12 PM

జిల్లాలో డిసెంబరులో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలతో ప్రధాన పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో 2025 ముగిసిపోనుంది. ఏడాది కాలంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఊహించని మలుపులు తిరిగాయి

kumaram bheem asifabad-పంచాయతీ ఎన్నికలతో పార్టీల్లో జోష్‌
లోగో

- అదే దూకుడుతో ముందుకు

- ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌, సిర్పూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధిక్యం

- మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో పట్టు కోసం కార్యాచరణ

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డిసెంబరులో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలతో ప్రధాన పార్టీలో జోష్‌ కనిపిస్తోంది. మరో మూడు రోజుల్లో 2025 ముగిసిపోనుంది. ఏడాది కాలంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఊహించని మలుపులు తిరిగాయి. రాష్ట్రంలో కాంగ్రె స్‌ పార్టీ అధికారంలో ఉండగా జిల్లాలోని ఆసిఫాబా ద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌కు చెందిన కోవ లక్ష్మి, సిర్పూర్‌ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన పాల్వాయి హరీష్‌బాబు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిని రేకెత్తిస్తు న్నాయి. జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఆసిఫా బాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారు. సిర్పూర్‌ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుపొందారు. జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విభిన్న తీర్పునిచ్చారు.

- మూడు విడతల్లో ఎన్నికలు..

జిల్లాలో 15 మండలాల పరిధిలో మూడు విడ తల్లో ఈనెల 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 335 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో వాంకిడి మండలంలోని తేజగూడ, ఆసిఫాబాద్‌ మండలంలోని రహపల్లి, చిలాటిగూడ గ్రామాలలో సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో అక్కడ నిర్వహించలేదు. మిగితా 332 గ్రామపంచాయతీల్లో అధికారు లు ఎన్నికలు నిర్వహించారు. ఆ గ్రామ పంచా యతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉండగా 2,91,216 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆసిఫా బాద్‌ నియోజకవర్గంలో 88 స్థానాలు కాంగ్రెస్‌, 59 స్థానాలు బీఆర్‌ఎస్‌, 8 స్థానాలు బీజేపీ, 36 స్థానా ల్లో స్వతంత్రులు గెలుపొందారు. కాగా సిర్పూర్‌ నియోజకవర్గంలో 30 స్థానాలు కాంగ్రెస్‌, 67 స్థానా లు బీఆర్‌ఎస్‌, 22 స్థానాలు బీజేపీ, 22 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విభిన్న తీర్పునిచ్చారు.

- జిల్లాలో భిన్న పరిస్థితి..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా జిల్లాలో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం ఇందు కు అద్దం పడుతోంది. ఆసిఫాబాద్‌ నియోజకవర్గం లో కోవ లక్ష్మి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, సిర్పూర్‌ నియోజకవర్గంలో పాల్వా యి హరీష్‌బాబు బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో డీసీసీ అధ్యక్షుడితో పాటు నియోజక వర్గ ఇన్‌చార్జీలకే కీలక బాధ్యతలను అప్పగించారు. దీంతో జిల్లాలో వారు పార్టీ కార్యకలాపాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర ఆంశాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో అదికార పార్టీలో రెండు నియోజక వర్గాల్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. పార్టీ కార్యకలాపా లకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆ పార్టీ నుంచి రావి శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశారు. అప్పటి నుంచి సిర్పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ పార్టీ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆసిఫా బాద్‌ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, డీసీసీగా కొనసాగిన విశ్వప్రసాద్‌రావు ల మధ్య గ్రూపు విభేదాలు చోటు చేసుకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త డీసీసీల నియామకానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఏఐసీసీ పరిశీలకులను జిల్లాలకు పంపించింది. డీసీసీల నియామక బాధ్యతలను వారికి అప్పగిం చింది. డీసీసీ పదవి కోసం జిల్లా నుంచి చాలా మంది పోటీలో ఉండగా చివరకు అదిష్ఠానం ఆత్రం సుగుణకు డీసీసీ పగ్గాలు అప్పగించింది. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, కోనేరు కోనప్పల మధ్య విభేదాలు కొనసాగుతు న్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎవరికి వారే తమ మద్దతుదారుల ను బరిలో నిలిపడం పరిస్థితిని తెలియజేస్తోంది. ఆసిఫాబాద్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్ని తానై ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల ఆందోళనలకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. ఇక బీజేపీ సైతం జిల్లాలో ముందుకు సాగుతున్నది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దోని శ్రీశైలంను నియమించింది. జిల్లాలో పార్టీ బలోపేతం కోసం సిర్పూర్‌ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, దోని శ్రీశైలం, ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అరిగెల నాగేశ్వర్‌ రావు, అరిగెల మల్లికార్జున్‌లతో పాటు ఇతర సీనియర్‌ నాయకులు ముందుకు సాగుతు న్నారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడు లేని విధంగా 30 స్థానాల్లో తమ మద్దతుదారు లను గెలిపించుకున్నారు.

- మద్దుతుదారుల గెలుపుతో..

పంచాయతీ పోరులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మద్దతుదారులు గెలుపొందడంతో అదే ఉత్సాహం తో ఆయా పార్టీలు దూకుడు పెంచాయి. జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల పై దృష్టి కేంద్రికరించింది. జిల్లాలో రెండు మున్సి పాలిటీలు, 127 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఆయా పార్టీలు తాము బలపరిచే అభ్య ర్థులను గెలిపించేలా వ్యూహాలు రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ నేతలకు సర్పం చ్‌ లు, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులుగా పదవులు లభించాయి. ఇక పట్టణ ప్రాంత కేడర్‌కు ఈ ఎన్నికల్లో మున్సిపల్‌ ఛైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, ఎంపీటీసీలుగా పదవులు దక్కించుకునేందుకు కార్యాచరణతో సాగుతున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 10:12 PM