పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ...
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:32 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల ప్రక్రి య ప్రారంభమైంది. రిజర్వేషన్లు 50 శాతం మించరా దన్న సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అధికారులు ఆమే రకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయగా, కలెక్టర్ కుమార్ దీపక్ తుది గెజిట్ నోటిఫికేషను విడు దల చేశారు.
-సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు
-గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్
-త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల
-ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-గ్రామాల్లో నెలకొన్న ఎన్నికల సందడి
మంచిర్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారులు రిజర్వేషన్లు ప్రకటించడంతో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల ప్రక్రి య ప్రారంభమైంది. రిజర్వేషన్లు 50 శాతం మించరా దన్న సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అధికారులు ఆమే రకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయగా, కలెక్టర్ కుమార్ దీపక్ తుది గెజిట్ నోటిఫికేషను విడు దల చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎ్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం, బీసీలకు గత ఏడాది నిర్వ హించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, సమగ్ర కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు. జి ల్లాలో మొత్తం 306 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటి పరిధిలోగల 2680 వార్డులకు ఎన్నికలు నిర్వహించవ లసి ఉంది. సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 23, ఎస్సీలకు 117, ఎస్టీలకు 29, జనరల్‌కు 137 స్థానాలను కేటాయిం చారు. అలాగే వార్డు సభ్యుల్లో స్థానాల్లో ఎస్సీలకు 803, ఎస్టీలకు 253, బీసీలకు 334, జనరల్ కేటగరీకి 1290 స్థానాలకు కేటాయించారు.
జిల్లాలో 3.7 లక్షల ఓటర్లు...
పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తుది ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలోని 306 గ్రామ పంచా యతీల పరిధిలో మొత్తం 3,76,669 ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 1,91,011 మంది ఉండగా, పురుషులు 1,85,643, ఇతరులు 15 మంది ఉన్నారు.
ఏర్పాట్లు పూర్తి....
పంచాయతీ ఎన్నిలకు అవసరమైన ఏర్పాట్లను అధి కారులు దాదాపుగా ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలోని 306 గ్రామ పంచా యతీలలో వార్డుకు ఒక పోలింగ్ బూత్ చొప్పున ర్పాటు చేయనున్నారు. జిల్లాలోని మొత్తం 306 గ్రామ పంచా యతీల పరిధిలో 2680 వార్డులు ఉన్నాయి. ఒక్కో వా ర్డుకు ఒకటి చొప్పున మొత్తంగా 2680 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నా రు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సు లు, ఇతర సామగ్రి జిల్లాకు ఇప్పటికే చేరింది. అలాగే ఎన్నికల సిబ్బంది నియామక ప్రక్రియ కూడా దాదాపు గా పూర్తికాగా, వారికి శిక్షణ కార్యక్రమం కూడా ముగిసింది.
పోటీకి సిద్ధపడుతున్న ఆశావహులు...
రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయినందున త్వరలోనే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉండటంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయాలు వేడె క్కాయి. రిజర్వేషన్లు అనుకూలిస్తే రంగంలోకి దిగాలని భావిస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఆశావహులు రిజ ర్వేషన్లు అనుకూలించిన చోట ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో టికెట్ సాధించాలనే పట్టుద లతో ఉన్న ఆశావహులు ఆ మేరకు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా సర్పంచ్ స్థానాలకు ఈ సారి యు వత రంగంలోకి దిగే అవకాశాలు అధికంగా కనిపిస్తు న్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పార్టీ పరంగా పెంచుతూ నిర్ణయం తీ సుకున్నప్పటికీ మొత్తంగా 50 శాతం రిజర్వేషన్లు పెం చరాదన్న నిబంధనలతో పాత పద్ధతిలోనే వివిధ వర్గాల జనాభా దామాషా ఆధారంగా సీట్లు కేటాయించారు. ఒకవేళ రిజర్వేషన్ అనుకూలించిన పక్షంలో ఎన్నికల్లో తమ అధృష్టాన్ని పరీక్షించుకోవాలనే కుతూహలంతో బీ సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఆశని పా తమే ఎదురైంది. దీంతో అన్ రిజర్వ్ కేటగరీలో బరిలోకి దిగడం ద్వారా తమ అధృష్టాన్ని పరీక్షించుకోవాలనే కు తూహలంతో ఉన్నారు. సర్పంచ్ పదవుల బరిలో నిల వాలనే ఔత్సాహికులు టికెట్ కోసం ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో మంత నాలు జరుపుతున్నారు. గత ఎన్నికల్లోనూ బీసీలు పై చేయి సాధించిన దాఖలాలు అనేకం ఉన్నాయి. జనరల్ స్థానాల్లోనూ తమ ప్రతిభను కనబరిచి అత్యధిక స్థానా లను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ మం డలాల నుంచి పెద్ద మొత్తంలో వెనుకబడ్డ కులస్థులు టికెట్ రేసులో ఉండే అవకాశాలు ఉన్నాయి. పంచాయ తీ ఎన్నికల్లో గెలుపు అధికార పార్టీకి తప్పనిసరి కావ డంతో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్ ముఖ్య నేత లు గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.
సర్పంచ్ రిజర్వేషన్లు మండలాల వారీగా...
మండలం జీపీల సంఖ్య ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
బెల్లంపల్లి 17 06 01 02 08
భీమారం 11 03 02 00 06
భీమిని 12 01 03 02 06
చెన్నూరు 30 11 02 02 15
దండేపల్లి 31 14 02 04 11
హాజీపూర్ 12 07 00 01 04
జైపూర్ 20 08 01 01 10
జన్నారం 29 09 06 02 12
కన్నెపల్లి 15 04 01 02 08
కాసిపేట 22 15 02 00 04
కోటపల్లి 31 12 03 00 16
లక్షెట్టిపేట 18 06 00 04 08
మందమర్రి 10 03 02 00 05
నెన్నెల 19 06 03 00 10
తాండూరు 15 05 01 02 07
వేమనపల్లి 14 04 02 01 07