Share News

ముమ్మరంగా ’పంచాయతీ’ ప్రచారం....

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:12 AM

పంచా యతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్పంచ్‌ అభ్యర్థులు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తు న్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు తమ మద్దతుదారుల తరుపున ప్రచారాలను ముమ్మరం చేశాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు నిత్యం ప్రజల మ ధ్యనే గడుపుతూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నా రు

ముమ్మరంగా ’పంచాయతీ’ ప్రచారం....

-జోరు పెంచిన సర్పంచ్‌ అభ్యర్థులు

-మందీ మార్బలంతో గ్రామాల పర్యటన

-ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మిలాఖత్‌

-బిజీబిజీగా గడుపుతున్న కుటుంబ సభ్యులు

మంచిర్యాల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సర్పంచ్‌ అభ్యర్థులు పూర్తిగా ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తు న్నారు. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు తమ మద్దతుదారుల తరుపున ప్రచారాలను ముమ్మరం చేశాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు నిత్యం ప్రజల మ ధ్యనే గడుపుతూ వారి మద్దతు కోసం ప్రయత్నిస్తున్నా రు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ తమను గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ఓటర్లకు వివరిస్తున్నారు. మైకులతో ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థులు ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నారు. గ్రా మాల్లో జట్ల వారీగా నాయకులు, కార్యకర్తలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పోటా పోటీగా...

ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల మద్దతున్న అ భ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఆక ట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విమర్శలు, ప్రతి వి మర్శలతో 16 గంటల పాటు ప్రజల మద్య గడుపుతు న్నారు. ఉదయం 6 గంటలకే ప్రజల్లోకి వెళుతున్న నా యకులు రాత్రి పదింటికి గాని ఇళ్లు చేరడం లేదు. పం చాయతీ ఎన్నికలు ఈ నెల 11,14,17 తేదీల్లో మూడు విడుతలుగా ఉన్నాయి. మొదటి విడుత ప్రచారానికి మ రో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ప్రచార హోరు పెంచారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ కష్టపడుతూనే ఉన్నారు. అల్పాహారం మొదలుకొని రాత్రి భోజనం వరకు ప్రజల తోనే కానిస్తున్నారు. ప్రధాన పార్టీల మద్దతున్న అభ్యర్థు ల నడుమ విపరీతమైన పోటీ ఉన్న కారణంగా గెలుపే లక్ష్యంగా ఎవరికి వారే ముమ్మర పోరాటం చేస్తున్నారు.

కుటుంబ సమేతంగా....

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వారి కుటుంభాల సమేతంగా పాల్గొంటూ బిజీబిజీగా గడుపు తున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికీ వెళు తూ ఓటర్లతో మిలాఖత్‌ అవుతున్నారు. జిల్లాలోని మం చిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల నేతల కుటుంబ సభ్యులను ఇతర ప్రాం తాల్లో ఉన్నవారిని ప్రత్యేకంగా రప్పించుకొని మరీ ప్రచా రంలో పాల్గొంటున్నారు. మంచిర్యాలలో నియోజక వర్గం లోని మొదటి విడుత ఎన్నికలు జరుగుతున్న హాజీ పూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లిలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ గ్రామాల్లో పర్యటిస్తూ కాం గ్రెస్‌ మద్దతిస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల్లోనూ అక్కడి ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద (మంత్రి), గడ్డం వినోద్‌ల ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ప్రచారం కోసం గ్రామాలబాట పడుతున్నారు. అలాగే మూడు నియో జక వర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌, బీజేపీలు మద్దతిస్తున్న అభ్యర్థుల తరుపున ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు విస్త్రతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

అభివృద్ధి చేసే వారికే మద్దతు....

పంచాయతీ ఎన్నికల్లో గ్రామాన్ని అన్ని విధాలా అ భివృద్ధి చేయగలిగే వారినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలనే పట్టుదలతో ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నేరుగా పార్టీల ప్రమేయం లేకపోవడం, స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉండటంతో ఓటర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్‌ అభ్యర్థుల పూర్వపు చరిత్ర, స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అ వగాహన కలిగి ఉండి, అభివృద్ధి చేయాలనే ధృడ సం కల్పం ఉన్న వారికే ప్రాధాన్యం ఇచ్చేందుకు ఓటర్లు సి ద్ధపడుతున్నారు. మరోవైపు మొదటి రెండు విడతల్లో ఏ కగ్రీవం అయిన పంచాయతీల్లోనూ అభ్యర్థుల సామ ర్థ్యానికే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లోనూ విద్యావంతులైన యువత అధికంగా ఉండటంతో తమ గ్రామాలను అభివృద్ధి పయనంలో నడిపించేందుకు సరి యైన అభ్యర్థినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలనే నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 07 , 2025 | 12:12 AM