ఆయకట్టులో వరినాట్లు షురూ
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:02 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కా ల్వకు నీటిని విడుదల చేయడంతో ఆయక ట్టు రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఆయకట్టులో వరినాట్లు షురూ
మహిళా కూలీలకు పెరిగిన డిమాండ్
దూరప్రాంతాల నుంచి రప్పించుకుంటున్న రైతాంగం
మిర్యాలగూడ అర్బన, జూలై 24(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కా ల్వకు నీటిని విడుదల చేయడంతో ఆయక ట్టు రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్ర స్తుతం సాగర్ ఎడమకాల్వకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టులో వరిసాగు సందడి మొదలైంది. ఇప్పటికే బోరు బావులు, చెరువులు, కుంటల నీటి ఆధారంగా పెంచిన నారుమళ్లు నాటే దశకు చేరుకున్నాయి. సాగర్‌కాల్వకు నీటి విడుదల చేస్తుండటంతో రైతులు వరి నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. సాగు పనుల్లో కర్షకులు తలమునకలై కనిపిస్తున్నారు. వానాకాలం సీజనలో రై తులు అత్యధికంగా సన్నరకాలైన 101, పద్మపూజ, పూజ, చిట్టిపొట్టి, సాంబమసూరి వంటి వరి రకాలకు ప్రాధాన్య మిచ్చారు. పెరిగిన నారుమళ్లను 30 రోజులలోపు నాటుకుంటే పిలకలు అధికంగా వచ్చి దిగుబడులు పెరుగుతాయన్న ఆశాభావంతో నాట్లు వేసేందుకు రైతులు పోటీ పడుతున్నారు.
కూలీలకు డిమాండ్
వరినాట్లు మొదలుపెట్టడంతో మహిళా కూలీల అవసరం పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా కూ లీలు స్థానికంగా దొరక్కపోవడంతో రైతులు పొరుగు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. ఆయకట్టు టేలాం డ్ ప్రాంతాల్లో వరినాట్లు మొదలయ్యేందుకు మరో పది రోజుల వ్యవధి ఉండటంతో ఆయా ప్రాంతాల కూలీలకు అడ్వాన్సలిచ్చి రప్పించుకుంటున్నారు. వే ములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో వరినాట్లు వే సేందుకు దామరచర్ల, అడవిదేవులపల్లి, నిడమనూ రు, త్రిపురారం మండలాల నుంచి కూలీలు తీసుకువస్తున్నారు. దీంతో రైతాంగానికి కాసింత ఊరట ద క్కి వరి నాట్లు ఊపందుకుంటున్నాయి.
పెరిగిన కూలీ రేట్లు
సాగర్ ఆయకట్టుతో పాటు ఆయకట్టేతర ప్రాం తాల్లోనూ ఏకకాలంలో వరినాట్లు మొ దలయ్యాయి. దీంతో కూలీల కొరత ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో కూ లీ రేట్లు పెరిగాయి. ఎకరం విస్తీర్ణం లో వరి నాటు వేసేందుకు రూ.4100 ఉన్న కూలీ రేటు 4800కు పెరిగింది. మహిళా కూలీ రేటు రూ.500 నుంచి 600 చేరగా, మగ కూలీలకు రూ. 1000నుంచి 1200లకు చేరింది. ద మ్ము చక్రాల రేట్లు సైతం గంటకు రూ.1200 నుంచి 1400లకు పెంచా రు. రైతుల్లో పోటీతత్వం పెరగడంతో కూలీల రేట్లు పెరిగినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. పె ట్టుబడి భారమవుతున్నా సాగు పనులు సకాలంలో పూర్తిచేయాలన్న తలంపుతో ముందుకెళ్తున్నామం టూ పలువురు రైతులు పేర్కొంటున్నారు. మరో వా రం, పదిరోజుల్లో వరినాట్లు వేసే మహిళా కూలీల కొరత అధికమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్న ఆయకట్టు ప్రాంతాల రైతాంగం బీహార్ కార్మికులను రప్పించుకునేందుకు సిద్ధపడుతున్నారు.
స్థానికంగా పనులు లేక వలస
మా ఊర్లో వరినాట్లు మొ దలయ్యేందుకు వారం, పది రోజులు పడుతుంది. సాగర్ ప్రధానకాల్వ దగ్గరలోని రైతు లు వరినాట్లు వేసేందుకు పి లుస్తున్నారు. దీంతో రోజూ 15నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు నాట్లు వేసేందుకు వెళ్తున్నాం. స్థానికంగా సాగు పనులు మొదలు పెట్టకపోవడంతో ఖాళీగా ఉండలేక ఇతర గ్రామాలకు వలసవెళ్తున్నాం.
- పానుగోతు జ్యోతి, మేసీ,్త్ర, జాలుబావితండా
ఎకరానికి రూ.6వేలు ఖర్చు
వరినాట్లు పూర్తి చేసేందుకు కూలీలు దొరకడంలేదు. పక్క గ్రామాల నుంచి తీసుకొ ని రావాల్సి వస్తోంది. దీంతో నాటు కూలీ పెరగడంతో పా టు అదనంగా రవాణా చార్జీ లు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఖర్చులన్నీ కలుపుకొని ఎకరం పొలం నాటు వేయించేందుకు రూ.6 వేల వరకు ఖర్చు వస్తోంది. అయినా విధిలేని పరిస్థితిల్లో భరించాల్సి వస్తోంది.
- ఎన.శ్రీనివాస్‌రెడ్డి, రైతు, వేములపల్లి