Share News

Kishan Reddy: నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో ఇక వెలుగులు

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:22 AM

దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ దీపావళి నుంచి వెలుగులు నిండబోతున్నాయని కేంద్ర బొగ్గు...

Kishan Reddy: నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో ఇక వెలుగులు

  • క్సలైట్లు జనజీవనంలోకి రావడాన్ని స్వాగతిస్తున్నా

  • కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా చీకట్లో మగ్గిన నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ దీపావళి నుంచి వెలుగులు నిండబోతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భారత్‌ను నక్సల్స్‌ రహిత దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆపరేషన్‌ కగార్‌ చేపట్టామని తెలిపారు. ఇటీవల కేవలం మూడు రోజుల్లోనే 300మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని, అందులో తెలుగువారు ఎక్కువ ఉన్నారని పేర్కొన్నారు. ఇంతకాలం నక్సలిజం కారణంగా అనేక జిల్లాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, ఇప్పుడు ఆ పల్లెలు అభివృద్ధి వైపు వెళుతున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలు ఉంటే ఇప్పుడు అవి 11కు తగ్గాయని, త్వరలోనే అవి కూడా నక్సల్స్‌ రహిత జిల్లాలుగా మారతాయని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. నక్స ల్స్‌ రహితంగా మారిన జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Updated Date - Oct 20 , 2025 | 04:22 AM