అటకెక్కిన మన ఊరు- మనబడి...!
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:22 PM
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా అత్యధికంగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 12 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించారు.
-పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటైన పథకం
-లక్ష్యం నెరవేరకుండానే నిలిచిపోయిన కార్యక్రమం
-మంచిర్యాల జిల్లాలో 246 పాఠశాలల ఎంపిక
-ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడే నిలిచిన పనులు
-జిల్లా వ్యాప్తంగా రూ. 4 కోట్లమేర పెండింగ్
-వసతుల కల్పన కోసం ఏఏపీసీ స్కీం
మంచిర్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం గత బీఆర్ ఎస్ ప్రభుత్వం మన ఊరు-మనబడి పథకానికి శ్రీకారం చుట్టింది. పథకంలో భాగంగా అత్యధికంగా విద్యార్థుల సంఖ్య ఉన్న పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం 12 రకాల పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ప్రహరీ గోడలు, గే ట్ల ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఫర్నీచ ర్, విద్యుద్దీకరణ, తాగునీటి సౌకర్యం, టాయ్‌లెట్ల నిర్మా ణం, తదితర పనులు చేపట్టడం ద్వారా విద్యార్థులకు అ వసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయిం చారు. అలా ఎంపిక చేసిన పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకుగాను టెండర్లు ఆహ్వానించి పనులు అప్ప గించారు. నిర్ణయించిన పనుల్లో కొంత భాగం పూర్తికా గా, మేజర్ వర్క్స్ అయిన అదనపు తరగతి గదులు, ప్ర హరీల నిర్మాణపనులు చాలా చోట్లా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో పథకం అటకెక్కిం ది. సకాలంలో నిధులు రాకపోవడం, రాష్ట్రంలో ప్రభు త్వం మారడం, తదితర కారణాల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సి వస్తోంది.
జిల్లాలో రూ. 4 కోట్ల పనులు పెండింగ్...
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో జిల్లా వ్యాప్తంగా మరో రూ. 4 కోట్ల 86 లక్షల 69వేల విలువైన పనులు చేపట్టవలసి ఉండగా, పథకం అర్థాంతరంగా రద్దయింది. పథకం కింద జిల్లాలో మొ త్తం 246 పాఠశాలలను ఎంపిక చేయగా, రూ. 56 కోట్ల కు పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇందులో దాదాపు రూ. 22 కోట్లతో 134 పాఠశాలల్లో చేపట్టిన పనులు పూర్తికాగా, మిగిలిన సొమ్ము చెల్లించ కపోవడంతో మరో 112 పాఠశాల్లో పనులు అర్థాంత రంగా నిలిచిపోయాయి. చేసిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు కాకపోవడంతో సంబంధిత కాంట్రా క్టర్లు ఎక్కడి పనులు అక్కడే వదిలిపెట్టారు. అలా పెం డింగులో ఉన్న నిధుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్రంలో అధికారంలో ఉ న్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ నిధులు విడుదల అయి తే తప్ప....అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు పూర్త య్యే అవకాశాలు లేవు.
ఏఏపీసీల ద్వారా పనులకు మోక్షం....
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏఏపీసీ (అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ) పథకానికి రూపకల్పన చేసింది. ఆ పథకం ద్వారానే ప్రస్తుతం పనులు చేపడుతోంది. అయితే ఈ పథకం ద్వారా వసతులైన తాగునీరు, ఫర్నీచర్, విద్యుదీ కరణ, రన్నింగ్ టాయ్‌లెట్, మైనర్ రిపేర్లు మాత్రమే చేపడుతున్నారు. తద్వారా విద్యార్థుల చదువులకు ఆటం కం కలగకుండా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ పథకమైన మన ఊరు - మనబడి కింద మంజూరై, పనులు ప్రారంభం కాని వాటిని కూ డా ఏఏపీసీలో చేర్చడం ద్వారా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారు. జిల్లాలో ఏఏపీసీ కింద 531 పాఠశాలలను ఎంపిక చేయగా, రూ. 19 కోట్ల నిధులతో పనులు చేప డుతున్నారు. ఇదిలా ఉండగా, మన ఊరు-మనబడి ప థకం కింద మంజూరై పనులు అర్థాంతరంగా నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ, తదితర మేజర్ వర్క్స్‌కు సంబంధించి ప్రస్తుతం పనులు ముం దుకు సాగడం లేదు. ఈ పనులకు సంబంధించి కాం గ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద వాటి భవి ష్యత్ ఆధారపడి ఉంటుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మన ఊరు-మనబడి కింద మంజూరైన మేజర్ వర్క్స్ అసంపూర్తిగా నిలిచిపో యినందున విద్యార్థుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలనే వి జ్ఞప్తులు వినిపిస్తున్నాయి.