Indian Railways: 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఓటీపీ ఆధారిత తత్కాల్ టికెట్లు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:47 AM
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో గురువారం నుంచి ఓటీపీ ఆధారిత టికెటింగ్ జారీ మొదలయింది. తత్కాల్ రిజర్వేషన్ల బుకింగ్‌లో...
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 15 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో గురువారం నుంచి ఓటీపీ ఆధారిత టికెటింగ్ జారీ మొదలయింది. తత్కాల్ రిజర్వేషన్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా ఓటీపీ ఆధారిత టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ప్రకారం రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద లేదా ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికుల మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని ధ్రువీకరించిన తర్వాతే టికెట్ జారీ అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రాథమికంగా 100కు పైగా రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.