Dedicated Ward for Transgender Patients: ఉస్మానియాలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వార్డు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:48 AM
ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పోస్టు ఆపరేటివ్ వార్డును అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో...
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆస్పత్రిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక పోస్టు ఆపరేటివ్ వార్డును అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఏర్పాటు చేసిన ఈ రెండు పడకల వార్డును ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ శుక్రవారం ప్రారంభించారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు అయిదుగురు ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పలుకురి లక్ష్మి తెలిపారు.