మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:17 PM
ప్రజలకు సేవా భావంతో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లయ న్స్‌క్లబ్ నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.
డీసీపీ భాస్కర్
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు సేవా భావంతో మెడికల్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్, లయ న్స్‌క్లబ్ నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ క్లబ్ ఆవరణలో మంచిర్యాల లయన్స్‌క్లబ్ చారిటబుల్ ట్రస్టు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, కరీంనగర్ రెనె ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపును నిర్వహించా రు. వైద్యులు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజే శారు. ఈ శిబిరంలో 460 మందికి వివిధ రకాల జబ్బుల కు సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించారు. డీసీ పీ భాస్కర్ క్యాంపును ప్రారంభించి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సేవాభావంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం అభి నందనీయమన్నారు. దీని ద్వారా ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగుతుందన్నారు. పేద ప్రజలు కొన్ని రో గాలకు వైద్య సేవలు ఉన్నప్పటికీ వారికి సరైన అవగా హన లేక ఆసుపత్రిలో వైద్యం చేసుకోవడం ఆర్ధిక భారం కావడంతో ఆసుపత్రికి వెళ్లలేకపోతారని, అటువంటి వారికి ఇలాంటి మెడికల్ క్యాంపులు మనోధైర్యం కల్పిస్తాయన్నా రు. అనంతరం నిర్వాహకులు మధుసూదన్‌రెడ్డి, సత్య పా ల్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రెనె ఆసుపత్రి ఆధ్వ ర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి మంచి స్పందన ల భించడం సంతోషంగా ఉందన్నారు. పలు విభాగాల వైద్యులతో పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పం పిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ కంకణాల భాస్కర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్ సభ్యులు, రెనె ఆసుపత్రి ప్రతినిధులు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.