kumaram bheem asifabad- సేంద్రియ సాగు బహుబాగు
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:25 AM
కాగజ్‌నగర్ మండలంలోని కోసినికి చెందిన రైతు వెంకటేశ్వర్ రావు తనకున్న ఐదు ఎకరాల పొలంలో సేంద్రియ విధానం ద్వారా వరి పంటను పండించారు. ఎలాంటి మందులు వాడకుండా పంట సాగు చేయడం విశేషం. పంటలపై రసాయనిక ప్రభావం అధికంగా ఉండడటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న సంఘటనలు తరుచూ చూస్తున్నాం.
కాగజ్‌నగర్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మండలంలోని కోసినికి చెందిన రైతు వెంకటేశ్వర్ రావు తనకున్న ఐదు ఎకరాల పొలంలో సేంద్రియ విధానం ద్వారా వరి పంటను పండించారు. ఎలాంటి మందులు వాడకుండా పంట సాగు చేయడం విశేషం. పంటలపై రసాయనిక ప్రభావం అధికంగా ఉండడటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న సంఘటనలు తరుచూ చూస్తున్నాం. ఏటా చీడ పీడ పురుగులు, పంట ఎదుగుల కోసం రసానిక ఎరువులు వేసే వారు. కాని ఈ విధానం కాకుండా ప్రత్యామ్నాయంగా సేంద్రియ సాగుపై దృష్టి సారించి, అధికారుల, సూచనలు సలహాలు తీసుకొని వంట వేసేందుకు శ్రీకారం చుట్టారు. విత్తన శుద్ధి ప్రక్రియ జీవామృతంలో 12 గంటల పాటు నాన బెట్టారు. నేం కేక్ నీళ్లు, గోమూత్రం ఐదు శాతం ద్రావణంలో నానా బెట్టారు. సేంద్రీయ పద్దతిలో ప్రధానంగా 8-12 రోజుల మొక్కలు నాటగా, ఒక్కొక్క మొక్కను కాస్త దూరంలో పెట్టారు. అలాగే నీరు నిల్వ కాకుండా తడి, ఎండగా చేశారు. వెర్మి కంపోస్టు ఎరువు, పంచగవ్యస్పె, జీవామృతం పదిరోజుకొకసారి చేస్తూ వరి పంటను సాగు చేశారు. ఈ విధానంలో నీరు ఎప్పుడు నిల్వ ఉండకూడదని, రోజుకు 2-3 సార్లు చిన్నగా నీరువదిలినా సరిపోతోంది. దీంతో నీటి వృధా తగ్గుతుంది. ప్రస్తుతం ఐదు ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఇది కోత దశకు వచ్చిందని చెబుతున్నారు.
రసాయనిక ఎరువులు వాడలేదు..
- వెంకటేశ్వర్ రావు, రైతు కోసిని
వరి పంట సాగుకు రసాయనిక ఎరువులు వాడలేదు.. సేంద్రియ విధానం వాడేందుకు తొలిసారిగా ప్రయత్నించాను. ఐదు ఎకరాల్లో వరి పంట వేశాను. పంట దిగుబడి అధికంగా వచ్చింది. భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. పంట దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. రసాయనికి ఎరువులు వాడడంతో భూమిలో పోషకాలు దెబ్బతింటాయి. రైతులు సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి.