Telangana Jagriti chief Kavitha: నిబంధనలకు విరుద్ధంగా సీఎం పర్యటన
ABN , Publish Date - Dec 01 , 2025 | 06:04 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ...
ఎస్‌ఈసీకి తెలంగాణ జాగృతి ఫిర్యాదు
హైదరాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును ఉపయోగించి సీఎం ప్రచారం చేస్తున్నారని ఆమె ఆదివారం నాడు ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. పట్టణాల్లోని సీఎం సభలకు ప్రభుత్వ సొమ్ముతో గ్రామీణ ప్రాంత ప్రజలను తరలిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజాధనాన్ని అక్రమంగా ఖర్చుచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని, తక్షణమే ఎన్నికల నియమావళిని అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ అంశంపై తెలంగాణ జాగృతి నేతలు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించారు. సీఎం రేవంత్ పర్యటనలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.