ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలి
ABN , Publish Date - Jun 15 , 2025 | 10:40 PM
ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ పా ర్టీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద పోస్టర్లు ఆవి ష్కరించారు.
శ్రీరాంపూర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ పా ర్టీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయం వద్ద పోస్టర్లు ఆవి ష్కరించారు. పార్టీ కోల్‌బెల్ట్ కార్యదర్శి డి. బ్రహ్మానందం మాట్లాడుతూ, కేంద్ర బలగాలు దండకారణ్య ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరిట జరుపుతున్న హత్యాకాండను ఆపాలని డిమాండ్ చేశారు. ఇటీవల కర్రె గుట్టలను చుట్టు ముట్టి 31 మంది మందిని ఎన్‌కౌంటర పేరిట కాల్చి చంపడం దారుణమ న్నారు. మావోయిస్టు కార్యదర్శి నంబాల కేశవరావును పట్టుకొని చంపడ మే కాకుండా అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం దు ర్మార్గమన్నారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ పేర్కొంటున్నా, కేంద్ర ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయకపోవడాన్ని తాము ఖండిస్తున్నామ న్నారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశా రు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రామయ్య, గద్దె మల్లేష్, పోతుల కిష్టయ్య, భూపతి యాదగిరి, కొదురుపాక సదానందం, పాల్గొన్నారు.