kumaram bheem asifabad- ఎకరాకు ఏడు క్వింటాళ్లే
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:47 PM
పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీ తంగా మారాయి. అతివృష్టి, అనావృష్టిని తట్టుకొని పంటను కాపాడుకున్న పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో పత్తి రైతులు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టాన్ని చవిచూడగా, పంట చేతికొచ్చే దశలో మొంథా తుఫాన్ కూడా కలవరపెట్టి పోయింది. మిగిలిన పత్తి దిగుబడిపై ఆశలు పెంచుకున్న రైతులకు నిబంధనల కత్తి మెడపై వేలాడుతోంది.
- పంట కొనుగోళ్లలో పరిమితి కుదింపు
- దిగుబడి అంచనాల తగ్గింపుతో అన్నదాతకు నష్టం
- కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రైతులు
- ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్‌తో ఇబ్బందులు
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీ తంగా మారాయి. అతివృష్టి, అనావృష్టిని తట్టుకొని పంటను కాపాడుకున్న పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో పత్తి రైతులు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టాన్ని చవిచూడగా, పంట చేతికొచ్చే దశలో మొంథా తుఫాన్ కూడా కలవరపెట్టి పోయింది. మిగిలిన పత్తి దిగుబడిపై ఆశలు పెంచుకున్న రైతులకు నిబంధనల కత్తి మెడపై వేలాడుతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుని మద్ద తు ధర పొందవచ్చని ఆశపడ్డ నిరాశ మిగిలింది. సీసీఐ కొనుగోళ్లలో కొర్రీలు పెడుతుండడంతో రైతులు మళ్లీ దళారులే దిక్కా అనే అయోమయ పరిస్థితిలో పడ్డారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ) రోజుకో నిబంధనలతో రైతులను ఇబ్బందులపాలు చేస్తోంది. ఇప్పటి దాకా కపాస్ కిసాన్ యాప్‌లో నమోదైన పంటకు మాత్రమే కొంటామని మెలికపెట్టగా తాజాగా ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాల్లో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునే వెసులు బాటు ఉంది. ప్రస్తుతం ఐదు క్వింటాళ్లు తగ్గించిం ది. తేమ, నాణ్యత పేరిట పెట్టే కొర్రిలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొత్త నిబంధన శాపంగా మారింది. దిగుబడి ఎక్కువ వచ్చిన రైతులు తప్పని పరిస్థితుల్లో దళారులు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- రోజుకో నిబంధన..
సీసీఐ రోజుకో నిబంధన తీసుకురావడం వల్ల రై తులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాలు పత్తి వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదికల్లో వెల్లడిం చారు. కాగా అకాల వర్షాలు, మోంథా తుఫాన్ వరదలతో పత్తికి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లా లో సుమారు 10వేల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అకాల వర్షాల వల్ల ఎకరాకు దిగుబడి తగ్గితే 8 క్వింటాళ్లుగా వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో ఈ ఏడాది 38 లక్షల క్వింటాళ్లు పత్తి దిగుబడి వస్తుం దని ఉన్నతా ధికారులు ఇచ్చిన నివేదికల ఆధారం గా 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు 7 క్వింటాళ్లు అని సీసీఐ ప్రకటిం చడంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాశారు. దీంతో పాటు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని 20 శాతం తేమ ఉన్నా సీసీఐ కొనుగోలు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని లేని పక్షంలో 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొను గోళ్లు నిలిపి వేస్తామని తెలంగాణ జిన్నింగ్ మిల్లర్స్, ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది.
- 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి..
జిల్లాలో ఈ ఏడాది సాగు చేసిన పత్తి విస్తీర్ణం లో 38 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికా రులు అంచనా వేశారు. ఈ లెక్క ప్రకారం సీసీఐ జిల్లా వ్యాప్తంగా 24 సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసేందుకు నోటిఫై చేశారు. ఈ మేరకు గురువారం నుంచి జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టనుంది. ఈ ఏడాది రైతులు పత్తి అమ్ముకునేందుకు స్లాట్ బుకింగ్ పద్దతి అమలు చేస్తున్నారు. ఏ రైతు అయితే తమ పత్తిని సీసీఐ కేంద్రంలో అమ్ముకోవాలని అనుకుం టాడో అంతకు రెండు, మూడు రోజుల ముందు ఆ న్‌లైన్‌లో స్లాట్‌బుక్ చేసుకోవాలి. ఈ విధానం వల్ల రైతులు సీసీఐ కేంద్రాల వద్ద వేచి చూసే అవసరం ఉండదు.
సీసీఐ సర్వే చేసి తగ్గించింది..
- ఆశ్వాక్ ఆహ్మద్, జిల్లా మార్కెటింగ్‌శాఖ అఽధికారి
సీసీఐ అధికారులు ఎకరానికి ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుమతి చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌లో పొందు పరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ అధికా రులు సర్వే చేసి గతంలో ఉన్న 12 క్వింటాళ్ల దిగుబడిని ఏడు క్వింటాళ్లుగా తేల్చారు. ఈ మేరకు ఈసారి కపాస్ కిసాన్ యాప్‌తో ఏడు క్వింటాళ్ల వరకే స్లాట్ బుకింగ్ అవుతుంది.