Share News

గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:25 PM

పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

గడువులోగా వచ్చిన నామినేషన్లు మాత్రమే స్వీకరించాలి
దండేపల్లిలో నామినేషన్‌ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగా మాత్రమే స్వీకరించాలని జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండలం లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాలను పరిశీ లించారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి నామినేషన్‌ స్వీకరణపై ఆరా తీసి సూచనలు, సలహాలను ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఈనెల 29వ తేదీన సాయంత్రం 5గంటలలోగా నామినేషన్‌ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలన్నారు. 5గంటలకు నామినేషన్‌ కేంద్రం గేటు మూసివేసి ఎవరిని లోనికి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. నామినే షన్‌ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేసన్‌ స్వీకరణ ప్రక్రియ నిబంధన లకు లోబడి త్వరగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడతలో 90 సర్పంచ్‌, 816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుందని ఆ యన పేర్కోన్నారు. నామినేషన్‌ సమర్పించే అభ్యర్థులు, ప్రతిపాదించే వారిని మత్రమే అనుమతించాలన్నారు. అనంతరం ద్వారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న షెడ్యూల్‌ తెగల బాలుర సంక్షేమ వసతిగృహం భవన నిర్మాణ పనులను సందర్శించి పనులను వేగవంతంతో నాణ్యతతో త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకో వాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం నామినేషన్ల కేంద్రాలలో నామినేషన్ల వేసే అభ్యర్థులతో ఆయన ముచ్చటించారు.

Updated Date - Nov 28 , 2025 | 11:25 PM