Share News

ఒత్తిడిని జయిస్తేనే విజేతలవుతారు

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:17 PM

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడిని జయిస్తేనే విజేతలుగా నిలుస్తారని జిల్లా అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని దేవా పూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.

ఒత్తిడిని జయిస్తేనే విజేతలవుతారు
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌

కాసిపేట, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడిని జయిస్తేనే విజేతలుగా నిలుస్తారని జిల్లా అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు. మంగళవారం మండలంలోని దేవా పూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పదవ తరగతి విద్యార్ధినులతో ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్దంగా చ దువుకోవాలని పరీక్షలంటే భయం వీడాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం దేవాపూర్‌లోని నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పురు షోత్తం నాయక్‌, ఎంపీడీవో సత్యనారాయ ణసింగ్‌, ప్రధానోపాధ్యాయు డు రొడ్డ గోపాల్‌, పంచాయతీ కార్యదర్శి కవిత పాల్గొన్నారు.

సంపూర్ణ అక్షరాస్యతకు అందరు సహకరించాలి

మండలంలో కొనసాగుతున్న అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు అందరు సహకరించాలని అదనపు కలెక్టర్‌ మోతి లాల్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జరి గిన నిరక్షరాస్యులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లా డుతూ ఈ నెల 31తో నిర్ధేశించుకున్న గడువు ముగిసిపోనుందని , వంద రోజుల అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరు భాగస్వాములు కావాలన్నారు. లీడ్‌ బ్యాంకు అధికారి తిరుప తి, తహసీల్దార్‌ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్‌, ప్రత్యేకా ధికారి పురుషోత్తం నాయక్‌, డీఆర్‌పీలు బండ శాంకరి పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:17 PM