సా..గుతున్న రోడ్డు విస్తరణ పనులు
ABN , Publish Date - May 05 , 2025 | 11:29 PM
గ్రామీణ ప్రాంతాల కు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు సాగుతున్నాయి. ఏ
సా..గుతున్న రోడ్డు విస్తరణ పనులు
సరైన రోడ్డు లేక ప్రజల అవస్థలు
తిప్పర్తి, మే 5(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల కు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు సాగుతున్నాయి. ఏళ్లు గడస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏదైనా పనులు ప్రారంభిస్తే 6 నెలలు ఏడాది కాలంలో పూర్తి చేయాలని కానీ తిప్పర్తి మం డలంలో మాత్రం శిలాఫలకాలతోనే సరిపెడుతున్నా రు. మండల పరిధిలోని కాశీవారిగూడెం నుంచి రాజుపేట వరకు, గంగన్నపాలెం నుంచి ఎర్రగంట్లగూడెం మీదుగా రాజుపేట వరకు, అద్దంకి - నార్కట్‌పల్లి బైపాస్ రోడ్డు నుండి కాశీవారిగూడెం గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి రెండు సం వత్సరాలు పూర్తి అయింది. ఈ మార్గంలో మొత్తంగా సుమారు 8 కిలోమీటర్ల రోడ్డును విస్తరణ చేయాల్సి ఉంది. కానీ పనులు రెండేళ్లయినా పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అదనపు దూరం
గంగన్నపాలెం గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి ఆ యా గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఈ రోడ్డు సమస్య వల్ల తిప్పర్తి మండల కేంద్రానికి చేరుకొని నల్లగొండకు వెళ్లాల్సి రావడంతో సుమారు 8 కిలోమీటర్లుల అదనంగా ప్ర యాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే విధం గా రాజుపేట గ్రామ పంచాయతీలోని యర్రగంట్లగూడెం గ్రామస్థులు జిల్లా కేంద్రానికి చేరుకోవాల న్నా, ఇటు మండల కేంద్రానికి చేరుకోవాలన్నా 2 గం టల సమయం పడుతున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. మట్టి రోడ్డు అయినా సరిగ్గా లేకపోవడం తో 3 కిలోమీటర్ల రోడ్డులో గంటకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే మాత్రం అదే రోడ్డుపై 2గంటలపైగా సమయం పడుతుందని, ఆ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు రోడ్డు పై జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి మా గ్రామాలకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ఆయా గ్రామాలను కలుపుతూ వెళ్లేలా ఆర్‌టీసీ బస్సులను కూడా నడిపించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
అత్యవసర సమయాల్లో ఇక్కట్లు
ఈ గ్రామాల ప్రజలకు సరైన రోడ్డు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్య కోసం కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఆయా గ్రామాలలోని విద్యార్థులు పాఠశాలలకు, పలు రకాల పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ప్రజలు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2023 మే నెలలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో భాగంగా గంగన్నపాలెం నుంచి రాజుపేట, చిన్నాయిగూడెం నుండి కాశీవారిగూడెం మీదుగా రాజుపేట వరకు రూ. 5.18 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభిస్తూ శిలాఫలకాలు దర్శనమిస్తున్నాయి కానీ నేటికి రోడ్డు పనులు ప్రారంభం కాలేదు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలి
మా గ్రామానికి రోడ్డు లేక చా లా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామం నుంచి మండల కేం ద్రానికి వెళ్లాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా 2 గంటల సమయం పడుతుంది. వర్షాకాలంలో ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు జా రిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించి గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా కల్పించాలి.
-వెంకట్‌రెడ్డి యర్రగంట్లగూడెం గ్రామస్థుడు
భూమి, నిధుల సమస్యతో ఆలస్యం
తిప్పర్తి మండల పరిధిలోని కాశీవారిగూడెం నుంచి రాజుపేట వరకు 2023లో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. పనులు రోడ్డు వేసే క్రమం లో భూ సమస్యతో కొంత ఆలస్యం జరిగింది. కాం ట్రాక్టర్ వద్ద నిధుల కొరతతో మరి కొంతకాలం ఆలస్యమైంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ నుంచి ఆర్‌ఆండ్‌బీ శాఖకు రోడ్డుకు సంబందించిన ఫైల్ బదిలీ చేయబడింది. అప్రూవల్ కాఫీ కోసం వేచి చూస్తున్నాం.
- పల్లి శ్రీనివాస్, ఏఈఈ