DGP Shivadhar Reddy: ఒక యూనిట్ రక్తదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:32 AM
రక్తదానం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర ప్రజలకు డీజీపీ శివధర్‌రెడ్డి....
హైదరాబాద్, అక్టోబర్ 29 (ఆంధ్రజ్యోతి): రక్తదానం వల్ల ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర ప్రజలకు డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్‌తో పాటు మరో 134 మంది పోలీసులు రక్తదానం చేశారు. వీరందరి నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఒక యూనిట్ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడంతో పాటు, రక్తంలోని ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ వంటి వాటితో మరో ముగ్గురికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని డీజీపీ అన్నారు.