kumaram bheem asifabad-ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి
ABN , Publish Date - Dec 25 , 2025 | 10:55 PM
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సిద్దేశ్వర్ సంస్థాన్ చైర్మన్ ఇంగ్లే కేశవ్‌రావ్ అన్నారు. మండలంలోని పట్నాపూర్‌లో గురువారం పరమ హంస సద్గురు పులాజీబాబ సమాధి మహోత్సం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పులాజీబాబ ధ్యాన మార్గంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. అనేక మంది మాంసం, మద్య పానానికి దూరం అయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
జైనూర్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సిద్దేశ్వర్ సంస్థాన్ చైర్మన్ ఇంగ్లే కేశవ్‌రావ్ అన్నారు. మండలంలోని పట్నాపూర్‌లో గురువారం పరమ హంస సద్గురు పులాజీబాబ సమాధి మహోత్సం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పులాజీబాబ ధ్యాన మార్గంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. అనేక మంది మాంసం, మద్య పానానికి దూరం అయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ పులాజీబాబా అందరికి ఆదర్శమని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తు అభివృద్ధికి బాట వేయాలని కోరారు. పట్నాపూర్ ప్రాంతంలో ధ్యాన సాధన పాఠశాల మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం చర్యలు తీసుకుంటామని అన్నారు. బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ఇన్‌చార్జి మురళిధర్‌రావ్ మాట్లాడుతూ పట్నాపూర్‌లో పులాజీబాబా సమాధి మహోత్సం వేడుకలకు తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ పట్నాపూర్ పరిసర ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఉత్తంరావ్ ఇంగ్లే, నాందేవ్ ససానె, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, మాజీ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, సంస్థాన్ ఉపాధ్యక్షుడు ఇంగ్లే వామన్‌రావ్, కార్యదర్శి సుభాష్, సభ్యులు దాదారావ్ అంద్ సమాజ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సిద్దేశ్వర్ సంస్థాన్ పూలాజీబాబా ధ్యాన కేంద్రంలో గురువారం పూలాజీ బాబా వర్థంతిని ధ్యాన కేంద్రం కమిటి సభ్యులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా జెండాను భక్తులు ఆవిష్కరించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు,సిర్పూర్(యు) ఎస్సై రామకృష్ణా పూల్లజీ బాబా కమిటీ సభ్యులు,ప్రజలు పూల్లజీ బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఎస్సై రామకృష్ణా మాట్లాడుతూ పూలాజీ బాబా ఆధ్యాత్మిక బోధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారు. కార్యక్రమంలో ధ్యాన కేంద్రం కమిటీ సభ్యులు మద్దేవడ్ దత్తు, మాద్దేవడ్ అనిల్‌కుమార్, మాద్దేవడ్ పుండలింక్, చిక్రం కైలాస్, ఉత్తమ్, సర్పంచ్‌లు ఆత్రం ఓంప్రకాష్, మెస్రం భూపతి, మాజీ సర్పంచ్‌లు ఆర్క నాగోరావు, ఆత్రం వీణాబాయి, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, నాయకులు ఆంధ్రయ్య, కోట్నాక పాండురంగ్, కమలకార్ తదితరులు పాల్గొన్నారు