యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:54 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో మంగళవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 8(ఆంధ్యజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆల యంలో మంగళవారం ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను వివిధ పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, బంగారు, వైజ్రవైఢూర్యాలతో దివ్యమనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అఽధిష్ఠిం పజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సహస్రనామా పఠనాలు, వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. పంచనారసింహుడి సన్నిధిలో కొలువు దీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం, నిత్యార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాల యంలో స్వయంభువులను సుప్రభాత సేవలతో మేల్కొల్పి నిజా భిషేకం, నిత్యార్చనలు, ముఖమండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలను పాంచారాత్రగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామికి ముఖ మండపంలోని స్పటికమూర్తులకు నిత్య పూజలు, నిత్యరుద్రహవనం శైవాగమన పద్ధతిలో కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.13,17,083 ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.