పదిలో వందశాతం ఫలితాలు రాబట్టాలి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:16 PM
ద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందిం చాలని జిల్లా విద్యాశాఖ ఏ రమేష్ కు మార్ ఉపాధ్యాయులకు సూచించారు.
- డీఈవో రమేష్ కుమార్
తెలకపల్లి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యో తి): విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందిం చాలని జిల్లా విద్యాశాఖ ఏ రమేష్ కు మార్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం తెలకపల్లి మండలంలో ని తెలకపల్లి, పెద్దపల్లి, ఆలేరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు పెద్దూరు, పెద్దపల్లి, ప్రాథమిక పాఠశా లలను డీఈవో తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సం ఖ్యను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నత పాఠశాలను సందర్శించి సబ్జెక్టులలో గల సిలబస్ పూర్తిగా అయ్యాయా లేదా అడిగి తెలుసు కున్నారు. ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం వివరాలపై ఆరా తీశారు. పదో తరగతి సబ్జెక్టులో సామర్థ్యాలను పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు.