వంద రోజులు...వంద శాతం..!
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:27 PM
అది మారు మూల గిరిజన మండలం. నిరక్ష్యరాస్యులు అధికంగా ఉ న్న గ్రామ పంచాయతీలు. పైగా ఏజెన్సీ ఏరియా అక్ష రాస్యతా శాతం అంతగా లేని ఆ మండలంలో కేవలం వంద రోజుల్లో.. నూరు శాతం అక్షరాస్యతను సాధించా రు అక్కడి ప్రజలు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక శ్రద్ధ తో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వయోజన విద్యా శాఖ ఈ ఘనత సాధించింది. జిల్లాలోనే ఎక్కడలేని వి ధంగా నూరు శాతం అక్షరాస్యతా శాతం సాధించిన మండలంగా కాసిపేట రికార్డుల్లోకి ఎక్కింది.
పైలట్ మండలంలో నూరు శాతం అక్షరాస్యత
కలెక్టర్ ప్రత్యేక చొరవతో మంచి ఫలితాలు
నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
మంచిర్యాల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): అది మారు మూల గిరిజన మండలం. నిరక్ష్యరాస్యులు అధికంగా ఉ న్న గ్రామ పంచాయతీలు. పైగా ఏజెన్సీ ఏరియా అక్ష రాస్యతా శాతం అంతగా లేని ఆ మండలంలో కేవలం వంద రోజుల్లో.. నూరు శాతం అక్షరాస్యతను సాధించా రు అక్కడి ప్రజలు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక శ్రద్ధ తో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వయోజన విద్యా శాఖ ఈ ఘనత సాధించింది. జిల్లాలోనే ఎక్కడలేని వి ధంగా నూరు శాతం అక్షరాస్యతా శాతం సాధించిన మండలంగా కాసిపేట రికార్డుల్లోకి ఎక్కింది.
కాసిపేట మండలంలో మొత్తం 22 గ్రామ పంచా యతీలు ఉన్నాయి. మండలంలో 32,749 మంది జనా భా ఉన్నారు. అక్షరాస్యతా కేవలం 60.58 శాతం మాత్ర మే ఉంది. మండలంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ, సింగరేణి భూగర్భ గని ఉండటంతో కొంతమంది ఆప రిశ్రమలలో ఉద్యోగాలు చేస్తుండగా, అధిక శాతం ప్రజ లు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మండల జనాభాలో అధిక శాతం గిరిజనులే ఉండటం తో అభివృద్ధి కొంతమేర వెనుకబడి ఉందనడంలో అతి శయోక్తి లేదు.
కలెక్టర్ నేతృత్వంలో....
అధికంగా గిరిజనులు ఉన్న మండలం కావడంతో క లెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక దృష్టి సారించారు. అధిక శాతం ప్రజలు నిరక్షరాస్యులు కావడంతో వారిని అక్షరా స్యులుగా మార్చాలన్న లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ చే పట్టారు. ప్రజలకు చదవడం, రాయడం నేర్పించడం కో సం వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతీ గ్రామ పం చాయతీలో రాత్రి బడులు ప్రారంభించారు. న్యూ ఇండి యా లిటరసీ ప్రొగ్రాంలో భాగంగా కేంధ్ర, రాష్ట్ర ప్ర భుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరాస్యతా పెంపొం దించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఇం దులో భాగంగా నిరక్ష్యరాస్యులను గుర్తిస్తుండగా, మం చిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 30,636 మందిని నమో దు చేశారు. జిల్లా వ్యాప్తంగా త్వరలో 3030 సెంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తం గా రాత్రి బడులు ఇంకా ఎక్కడా ప్రారంభం కాకముందే ప్రత్యేకంగా కాసిపేట మండలంలో ప్రారంభమై విజయ వంతంగా వంద రోజులు కూడా పూర్తి చేసుకోవడం గమనార్హం.
బోధనకు ప్రత్యేకంగా వలంటీర్లు...
కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో రాత్రి బడులు నిర్వహించేందుకు 22 మంది వలంటీర్ల ను నియమించారు. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మే 2025 వరకు రాత్రి బడులు కొనసాగగా, 15 సంవత్స రాలు పైబడిన నిరక్షరాస్యులకు ప్రతి రోజూ 7.30 నుంచి 9.30 వరకు చదవడం, రాయడం నేర్పించడం వలంటీర్ల విధి. అలా వంద రోజుల వ్యవధిలో గ్రామానికి చెందిన 3,562 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. రాత్రి బ డులను జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ వలంటీర్లకు అవసరమైన (5వ పేజీ తరువాయి)
సూచనలు, సలహాలు అందజేసేవారు. తద్వారా వంద రోజుల్లో మండలాన్ని సంపూర్ణ అక్ష్యరాస్య తగల మండలంగా తీర్చిదిదారు. అక్షరాస్యులుగా మారిన వా రికి పరీక్ష నిర్వహించి, యోగ్యతా పత్రాలు సైతం కలె క్టర్ చేతుల మీదుగా అందజేశారు.
కుట్టు శిక్షణ సైతం..
రాత్రి బడులకు అదనంగా మండలంలోని 22 గ్రా మ పంచాయతీల్లో మహిళలకు ఉపాధి కల్పించేందు కు ప్రతి గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. కుట్టు శిక్షణ నేర్చుకున్న ప్రతీ ఒక్కరి కి ఐదు నుంచి 10 మందిని అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను అధికారులు అప్పగించారు. అలా నిర్ణీత గ డువులోగా మండలంలో నూరు శాతం అక్షరాస్యత సా ధ్యపడింది. ఇలా కలెక్టర్ చొరవతో మండలంలో అక్షరా స్యతా పెంపొందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు.
ఓరియంట్ యాజమాన్యం సహకారంతో...
మండలంలోని దేవాపూర్‌లోగల ఓరియంట్ సిమెం ట్ కంపెనీ యాజమాన్యం సహకారంతో ప్రత్యేక కార్య క్రమం విజయవంతంగా పూర్తి చేశారు. నిరక్షరాస్యు ల కు విద్యను బోధించే వలంటీర్లకు వేతనాలు, ఇతర త్రా ఖర్చులు దాదాపు రూ. 13 లక్షల మేర ఓరియంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం భరించినట్లు అధికారులు తెలిపారు.
గిరిజన మండలం కావడంతోనే..
కలెక్టర్ కుమార్ దీపక్
ఏజెన్సీ ఏరియాలోని గిరిజన మండలం కావడం తో నే కాసిపేటను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకోవ లసి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా కాసిపేట లోనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వం ద శాతం అక్షరాస్యతను సాధించగలిగాము. వివిధ శా ఖల అధికారులు తోడ్పాటు నందించడంతోనే కార్యక్ర మం విజయ వంతం అయింది.