Share News

ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాలకు వెలుగు

ABN , Publish Date - Aug 28 , 2025 | 11:32 PM

ఒకరి నేత్రదా నం ఇద్దరి జీవితాలకు వెలుగు నిస్తుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలి పారు.

ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాలకు వెలుగు
కంటి పరీక్షలు చేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవికుమార్‌

కందనూలు, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి) : ఒకరి నేత్రదా నం ఇద్దరి జీవితాలకు వెలుగు నిస్తుందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ రవికుమార్‌ తెలి పారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్‌ కార్యాలయంలో నేత్రదా న పక్షోత్సవ కార్యక్రమాన్ని ఆ యన ప్రారంభించారు. బుధవారం కంటి పరీక్షా శిబిరంలో 68 మందిని పరీక్షించి 21 మందిని కంటి శుక్లాల శస్త్ర చికిత్స కోసం గుర్తించారు. ఆ యన మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటదాస్‌, నేత్రాధికా రులు వెంకటస్వామి, కొట్ర బాలాజీ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ నరసింహ, డీవీఎల్‌ఎం.కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ చెన్నకేశవ పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2025 | 11:32 PM