Share News

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:22 PM

ఒక్క సీసీ కెమె రా 100మంది పోలీసులతో సమా నమని కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
రఘుపతిపేటలో సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి

- కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి

కల్వకుర్తి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఒక్క సీసీ కెమె రా 100మంది పోలీసులతో సమా నమని కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టణాలతో పాటు గ్రామాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలంతా స్వచ్ఛందం గా ముందుకు వచ్చి ఏర్పాటు చేసు కోవాలని ఆయన సూచించారు. క ల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో కమ్యూనిటీ ఆవేర్నెస్‌ ప్రోగ్రాంలో భా గంగా గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన 12సీసీ కెమెరాలను గురువారం కల్వకుర్తి సీఐ బి.నాగార్జున, ఎస్‌ఐ జి.మాధవరెడ్డి, కాంగ్రెస్‌ నా యకుడు శ్రీపురం హరీశ్వర్‌రెడ్డిలతో కలిసి డీ ఎస్పీ సైరెడ్డివెంకట్‌రెడ్డి ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగు తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే సీసీ కెమెరాలు ఉంటే నేరస్తులను తక్ష ణమే గుర్తించి శిక్షించవచ్చునని ఆయన సూచిం చారు. కార్యక్రమంలో సీఐ బి.నా గార్జున, ఎస్‌ఐ జి.మాధవరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు ఎస్‌.హరీ శ్వర్‌రెడ్డి, బాలస్వామి, రవి పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:22 PM