బైపాస్ పనులు పూర్తి చేశాకే.. రహదారి విస్తరణ చేపట్టాలి
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:02 PM
నిర్మాణ దశలో ఉన్న బైపాస్ రహదారిని పూర్తి చేసి వాహనాలను ఆ రహదారి గుండా మళ్లించాకే రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని పలువురు వ్యాపారులు, బాధితులు డిమాం డ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వ్యాపారులు, బాధితులు మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని పే ర్కొనడం సరికాదన్నారు.
చెన్నూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : నిర్మాణ దశలో ఉన్న బైపాస్ రహదారిని పూర్తి చేసి వాహనాలను ఆ రహదారి గుండా మళ్లించాకే రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని పలువురు వ్యాపారులు, బాధితులు డిమాం డ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వ్యాపారులు, బాధితులు మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు ఎ లాంటి నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని పే ర్కొనడం సరికాదన్నారు. అంబేద్కర్ చౌక్ నుంచి రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడితే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ముందుగా బైపాస్ రహదారిని పూర్తి చేసి ఆ రహదారి గుం డా వాహనాలను మళ్లించి రాకపోకలు సాగిస్తే కొంత మేరకు ట్రాఫిక్ సమ స్య తీరుతుందన్నారు. ముందుగా బైపాస్ రహదారి పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రోడ్డు విస్తరణ ఎన్ని ఫీట్ల మేరకు చేపడతారో ముందుగా నోటీసుల ద్వారా తెలపాలన్నారు. తమ తాతల కాలం నుంచి వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ లో పెద్ద పెద్ద భవనాలను కూలగొడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నా రు. రోడ్డు విస్తరణలో భారీ నష్టం జరగకుండా 40 ఫీట్ల మేరకే విస్తరణ ప నులను చేపట్టాలని కోరారు. రోడ్డు విస్తరణ వల్ల పూర్తిగా దుకాణ సము దాయాలు కోల్పోతున్న వ్యాపారులకు ఉపాధి మార్గం చూపాలని మంత్రికి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ సమావేశంలో వ్యాపారులు, బాధి తులు పాల్గొన్నారు.