Share News

అభివృద్ధి పథంలో....

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:46 PM

గడిచిన ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి పథంలో పయని స్తోంది. దశాబ్దాలుగా అమలుకు నోచుకోకుండా ఉన్న ప్రధాన పనులు సైతం ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నా యి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ని యోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మంత్రి గడ్డం వివేకానంద్‌, గడ్డం వినోద్‌ కృషితో విద్య, వైద్యంతోపాటు తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

అభివృద్ధి పథంలో....
జిల్లా కేంధ్రంలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నమూనా

-ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు

-నియోజక వర్గాల వారీగా అభివృద్ధికి చర్యలు

-జిల్లా కేంద్రంలో సుమారు రూ. వెయ్యి కోట్లతో పనులు

-బెల్లంపల్లి ప్రజలకు తాగునీటి భాగ్యం

-చెన్నూరులో వేగంగా అభివృద్ది పనులు

మంచిర్యాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గడిచిన ఏడాది కాలంలో జిల్లా అభివృద్ధి పథంలో పయని స్తోంది. దశాబ్దాలుగా అమలుకు నోచుకోకుండా ఉన్న ప్రధాన పనులు సైతం ఎట్టకేలకు కొలిక్కి వస్తున్నా యి. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ని యోజక వర్గాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మంత్రి గడ్డం వివేకానంద్‌, గడ్డం వినోద్‌ కృషితో విద్య, వైద్యంతోపాటు తాగునీటి సౌకర్యం, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

మంచిర్యాల నియోజక వర్గంలో....

మంచిర్యాల జిల్లా కేంద్రదంలో ఎన్నడూ లేనివిధం గా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అభివృద్ధికి బా టలు వేస్తున్నారు. ఐబీ సమీపంలోని పాత ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో ఏడు అంతస్థులతో ఆసుపత్రి భ వన నిర్మాణం చేపట్టనుండగా కార్పొరేట్‌ స్థాయిలో వై ద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశా రు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ నిధులు కే టాయించడంతో గత ఏడాది నవంబరు 21వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్మిం హా, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బులు శంకుస్థాపన చేశారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసు పత్రి నిర్మాణంతో మంచిర్యాల, కొమరంభీం జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలకు మెరుగైన వైద్య సే వలు అందనున్నాయి. అదే ప్రాంగణంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్మించనున్నారు. రెండు ఆసుపత్రులు ఒకే ప్రాంగణంలో నిర్మించడం వల్ల రో గులకు వైద్యసేవల పరంగా అందుబాటులో ఉండను న్నాయి. ఎంసీహెచ్‌ గోదావరి సమీపంలో ఉండటం, వర్షాకాలంలో ప్రతియేటా వరద ముంపునకు గురవు తోంది. దీంతో అక్కడ చికిత్స పొందే గర్భిణులు, బా లింతలతోపాటు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నా రు. దీంతో ఎంసీహెచ్‌ భవనాన్ని కూడా ఐబీ సమీపంలోనే నిర్మిస్తున్నారు.

ఇండోర్‌ స్టేడియం మంజూరు....

జిల్లా కేంద్రంలో ఇండోర్‌ స్టేడియం మంజూరైంది. సాయికుంటలో ప్రభుత్వం స్థలం సర్వే నెంబర్లు 662, 675లలో 10 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రావు సూచనలతో స్పోర్ట్స్‌ అథారిటీకి కేటాయిస్తూ రె వెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో సు మా రు రూ. 30 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ పర్ప స్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించేందుకు మార్గం సుగమం అయింది. రూ. 14 కోట్లతో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రూ. 9.5 కోట్లతో 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌, రూ. 6 కోట్లతో స్విమ్మింగ్‌ పూల్‌ ని ర్మించనున్నారు. ఇండోర్‌ స్టేడియం అంచనా వ్యయం మొత్తం నుంచి ఖేలో ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం 40:60 నిష్పత్తిలో భరించనున్నాయి. ఇండోర్‌ స్టేడియం ఆవరణలో స్పోర్ట్స్‌ హాస్టల్‌ నిర్మాణం చేపట్టేందుకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో ఐటీ హబ్‌ ఏర్పాటుకు శంకు స్థాపన చేశారు. దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల పరిధిలో రైతులకు సాగునీటి కొరత తీర్చేందుకు రూ. 74.40 లక్ష్యల అంచనా వ్యయంతో నాలుగు మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు మంజూరయ్యాయి.

రూ. 260 కోట్లతో కరకట్ట నిర్మాణం....

నగరంలోని రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణం చేప ట్టడం ద్వారా వరదను నివారించడానికి పనులు ప్రా రంభమయ్యాయి. క్వారీ రోడ్డు బ్రిడ్జి నుంచి 7.5 కిలో మీటర్ల పొడవుతో సుమారు 10 మీటర్ల ఎత్తుతో ప్రస్తు తం ఒకవైపు కరకట్టను నిర్మిస్తున్నారు. ప్రతిసారీ వర దలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఎమ్మెల్యే కృషితో కరకట్టల నిర్మాణానికి మోక్షం లభించింది.

శ్మశాన వాటిక నిర్మాణంతో తీరిన కష్టాలు...

జిల్లా కేంద్రంలో ఇంతకాలం హిందూ శ్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడే వారు. గోదావరి సమీపంలో ఎట్టకేలకు హిందూ శ్మ శాన వాటిక నిర్మాణం పూర్తి చేసుకొని, ప్రజలకు అం దుబాటులోకి వచ్చింది. స్థానిక బూధాన్‌ భూములు నాలుగు ఎకరాల్లో రూ. 11 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో శ్మశాన వాటికకు ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కృషితో ప్రజల కళ సాకారమైంది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరణ...

మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అవతరిం చగా, దశాబ్దాల ప్రజల డిమాండ్‌ నెరవేరినట్లయింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే మంచిర్యాల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు ప్రధాన రైల్వే మార్గం అందుబాటు లో ఉండటంతో వేగంగా అభివృద్ధి సాధించింది. 1956 లో మంచిర్యాల మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, అప్ప టి నుంచి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. 36 వార్డులతో ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీ 60 డివిజ న్‌లతో కూడిన కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందింది. మంచిర్యాల చుట్టు పక్కల బొగ్గు బావులు, సిరామిక్‌ ఇండస్ట్రీలతోపాటు, విద్యుత్‌ పరిశ్రమలు ఉన్నాయి. వా ణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరుంది.

బెల్లంపల్లి వాసులకు తాగునీరు....

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ప్రత్యేక కృషితో నియోజక వర్గ ప్రజల దాహం తీర్చేందుకు మోక్షం కలిగింది. ఇంతకాలం కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లోని అడ ప్రాజెక్టు నుంచి నీరు అందుతుండగా, ప్ర స్తుతం హాజీపూర్‌ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో నీరు ఇచ్చేందుకు పనులు వే గంగా జరుగుతున్నాయి. అడ ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ ద్వారా సాగునీటి సరఫరా చేసేవా రు. ఈ ప్రాజెక్టు నీరు వర్షాకాలంలో కలుషితం అవు తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అమృత్‌ పథకంలో భాగంగా బెల్లంపల్లి పట్టణ వాసు లకు రక్షిత గోదావరి నీరు అందనుంది. ఎల్లంపల్లి ప్రా జెక్టు నుంచి బెల్లంపల్లి వరకు రూ. 61.50 లక్షల అం చనా వ్యయంతో అమృత్‌ 2.0 పథకం పనులు చేపట్ట గా దాదాపు 60 పూర్తి కావచ్చాయి. అలాగే బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి నుంచి లింగాపూర్‌ వరకు రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బెల్లంపల్లి పట్టణంలో రహదారులు వెడల్పులేక ట్రాఫిక్‌ సమస్య జఠిల మైంది. ఇటీవల రూ. 17.77 కోట్లతో చేపడుతున్న రో డ్డు వెడల్పు పనుల వల్ల ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి.

అభివృద్ధి దిశగా చెన్నూరు నియోజక వర్గం...

చెన్నూరు నియోజక వర్గం కూడా ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేకానంద కృషితో అభివృద్ధి దిశగా పయని స్తోంది. కోటపల్లి మండలంలో ప్రజల తాగునీటి అవ సరాలు తీర్చడానికి బోరు బావుల నిర్మాణం చేపట్టారు. భీమారం మండలం కేంద్రంలో కొత్తగా రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రా రంభించారు. మండలంలోని బూరుగుపల్లి గ్రామం నుంచి గెర్రెగూడెం మీదుగా దాంపూర్‌ వరకు బీటీ రో డ్డుకు శంకుస్థాపన చేయగా, త్వరలో పనులు ప్రారం భించనున్నారు. క్యాతన్‌పల్లిలో దశాబ్దాలుగా పెండింగు లో ఉన్న రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తి కావడంతో ప్రజలకు రవాణా మార్గం సులభతరం అయింది. నియోజక వర్గంలో తాగునీటి ఏర్పాటుకు అమృత్‌ వాటర్‌ స్కీంను ప్రారంభించారు. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుచి 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేశారు. అలాగే అమృత్‌ పథకం 2.0 ద్వారా రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో ప్రజలకు తాగునీటి సౌకర్యం కలిగింది.

Updated Date - Dec 27 , 2025 | 10:46 PM