‘అయ్యో’మయం..
ABN , Publish Date - May 23 , 2025 | 11:39 PM
ఎల్‌ఆర్‌ఎస్ కో సం 2015 నుంచి 2020 మధ్యకాలంలో రూ. 10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అయోమ యంగా మారింది. ఏళ్లు గడిచినా వారి దరఖాస్తులు ఇ ప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
2015 నాటి దరఖాస్తులకు కలగని మోక్షం
మొత్తం ఫీజు చెల్లించినవారి ఫైళ్లు మాత్రమే క్లియర్
రూ. 10 వేలు చెల్లించిన వారిని పట్టించుకోని వైనం
జిల్లాలో వేల సంఖ్యలో పెండింగ్
మంచిర్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ కో సం 2015 నుంచి 2020 మధ్యకాలంలో రూ. 10వేలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి అయోమ యంగా మారింది. ఏళ్లు గడిచినా వారి దరఖాస్తులు ఇ ప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త విధా నం కింద మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా వారికి లేకుండా పోయింది. అయితే పూర్తిస్థా యిలో రుసుం చెల్లించిన వారి సమస్యలను మాత్రం మున్సిపాలిటీలు పరిష్కరిస్తుండటంతో రూ. 10 వేలు చెల్లించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దరఖా స్తుదారులంతా తమ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పదేళ్ల క్రితం దరఖాస్తుల ఆహ్వానం...
అనుమతి లేని లే-అవుట్లలోని ఇళ్ల స్థలాల క్రమబ ద్ధీకరణకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలుత 2015 లో అవకాశం కల్పించింది. ఇందుకోసం భూ క్రమబద్ధీక రణ పథకాన్ని (ఎల్‌ఆర్‌ఎస్) తీసుకువచ్చింది. ఈ మే రకు 2015 నవంబర్ 2న జీవో నెంబరు 151 జారీ జే సింది. ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తులను ఆహ్వానిం చిం ది కూడా. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వ చ్చారు. జిల్లా కేంద్రంతోపాటు, పరిసర ప్రాంతాల నుం చి సుమారు 40 వేలకు వరకు దరఖాస్తులు దాఖల య్యాయి. ఎల్‌ఆర్‌ఎస్ చేసే బాధ్యతను ప్రభుత్వం ప ట్టణాభివృద్ధి సంస్థలకే ప్రభుత్వం అప్పగించడంతో ఆ దరఖాస్తులను పరిష్కరించే బాధ్యత మున్సిపాలిటీలపై పడింది. దరఖాస్తులు దాఖలు సందర్భంగా కుడా రూ. 10 వేల చొప్పున వసూలు చేయగా, సమస్య పరిష్కా రమైన తర్వాత మిగతా డబ్బును దఫాల వారీగా వ సూలు చేశారు. దీంతో స్థల విస్తీర్ణాన్ని బట్టి లక్షల రూ పాయల్లో దరఖాస్తు దారులు చెల్లించారు. ఎల్‌ఆర్‌ఎస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ద్వారా వి నియోగదారులు దరఖాస్తులను అప్‌లోడ్ చేశారు. లైసె న్స్‌డ్ సర్వేయర్ల సహకారంతో పూర్తి వివరాలను, ఇతర సంబంధిత పత్రాలను జతచేసి, దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు.
వెబ్‌సైట్ మూసివేయడంతో గందరగోళం...
ఇదిలా ఉండగా ఎల్‌ఆర్‌ఎస్ వెబ్‌సైట్‌ను అప్పటి ప్ర భుత్వం మూసివేయడంతో గందరగోళ పరిస్థితులు నెల కొన్నాయి. పథకం ద్వారా ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి..? వాటి పరిస్థితి ఏమిటీ...? అన్న విష యాలు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉన్నాయని భా వించిన దరఖాస్తుదారులకు మొదట్లో కట్టిన రూ.10 వే లకు అదనంగా మార్కెట్ విలువను బట్టి మిగతా రె గ్యులరైజేషన్ చార్జీలను చెల్లించాలని మున్సిపాలిటీలు నోటీసులు అందజేశాయి. ఈ నోటీసులు అందుకున్న వారిలో చాలామంది నిర్దేశిత మొత్తాన్ని చెల్లించారు. అ యితే అవి కూడా ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకో లేదు. ఎల్‌ఆర్‌ఎస్ స్కీం నిబంధనల మేరకు వినియోగ దారుల నుంచి చార్జీలు వసూలు చేసిన అధికారులు వారిలో చాలా మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. ఇక్కడ రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మాత్రం ఎలాంటి జాప్యం లేకుండా ప్రొసీడింగ్స్ అందినట్లు అప్పట్లో విమ ర్శలు గుప్పుమన్నాయి. మిగతా వారి సమస్య పరిష్కా రం కాకపోవడానికి సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్న ప్రచారం జరిగింది. క్షేత్ర స్థాయిలో స్థలాలను సందర్శిం చి దరఖాస్తులను పరిష్కరించవలసిన అప్పటి అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణ లు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ 2020 వరకు కొన సాగుతూ వచ్చింది. అప్పటి వరకు కూడా వేల సంఖ్య లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత వె బ్‌సైట్ మూసివేయడంతో దరఖాస్తులు అటకెక్కాయి.
మొత్తం ఫీజు చెల్లించిన వారికి పరిష్కారం...
రెగ్యులరైజేషన్ చార్జీలు మొత్తం చెల్లించిన వారి దర ఖాస్తులను మాత్రమే పరిష్కరిస్తున్నామని కుడా అధి కారులు చెబుతున్నారు. డబ్బులు పూర్తిగా కట్టిన వారికి రెగ్యులరైజేషన్ కోసం నోటీసులు పంపినా స్పందనా లేదని అధికారులు చెబుతుండగా, తమకు ఎలాంటి నో టీసులు అందలేదని దరఖాస్తు దారులు చెబుతున్నారు. రెగ్యులరైజేషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లయిన రిజి స్ట్రేషన్ డీడ్, ఎల్‌ఆర్‌ఎస్ ప్లాన్, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్, అండర్‌టేకింగ్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (ఈ సీ)ని దరఖాస్తుతోపాటు జతచేసిన వారికి సక్రమంగా నే ప్రొసీడింగ్స్ అందగా, అరకొరగా జతచేసిన వారికే స మస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్పందిం చి పదేళ్ల క్రితం రూ. 10వేలు చెల్లించిన వారి సమస్య ను పరిష్కరించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.