Share News

వీరమనాయని చెరువులో అధికారుల సర్వే

ABN , Publish Date - May 29 , 2025 | 11:19 PM

మండల పరిధిలోని యన్మన్‌బెట్ల గ్రా మంలో గల వీరమనాయని చెరువుకు సాగునీరు అందించేందుకు గురువారం ఇరిగేషన్‌ శాఖ అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించారు.

వీరమనాయని చెరువులో అధికారుల సర్వే
అధికారులకు వివరిస్తున్న మాజీ సర్పంచ్‌ నాగరాజు

కొల్లాపూర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని యన్మన్‌బెట్ల గ్రా మంలో గల వీరమనాయని చెరువుకు సాగునీరు అందించేందుకు గురువారం ఇరిగేషన్‌ శాఖ అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించారు. వీరమనాయని చెరువుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలను ఇరిగేషన్‌ శాఖ అధి కారులు క్షుణ్ణంగా పరిశీలించారు. భీమా కాలువ పసుపుల కెనాల్‌, సింగోటం శ్రీవారి స ముద్రం ఈ మూడు మార్గాల ద్వారా వీరమ నాయని చెరువుకు నీటిని ఏమార్గం ద్వారా తీసుకువస్తే ఉపయోగంగా ఉంటుందో అధికా రులు పరిశీలించారు. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో వీరమనాయని చెరువుకు సాగునీటి కల సాకా రం కావొచ్చిందని గ్రామ మాజీ సర్పంచ్‌ మేకల నాగరాజు వెల్లడించారు. సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీపీ నిరంజన్‌ రావు, మాజీ సర్పంచ్‌ ఆశం నాగరాజు, నాయ కులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:19 PM