అధికారులు సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:52 PM
ఈ నెల 17న జరగనున్న మూడో విడత పోలింగ్ నిర్వహణ కోసం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 17న జరగనున్న మూడో విడత పోలింగ్ నిర్వహణ కోసం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటింగ్, కౌం టింగ్ కోసం అవసరమైన సామగ్రిని పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. ఈ నెల 16న అధికారులు నిర్ధేశిత సమయానికి తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని, పోలింగ్ కేంద్రాల వారికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17న చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్ధానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందన్నారు.అర్హులైన వారందరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.