kumaram bheem asifabad-అధికారులు సమాచారం సిద్ధం చేయాలి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:00 PM
జిల్లాలో త్వరలో కేంద్రమంత్రి పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖల పూర్తి సమాచారం సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం డేవిడ్‌లతో కలిసి త్వరలో జిల్లాలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహరాల శాఖ మంత్రి హర్ష మల్హోత్ర కార్యక్రమంపై బుధవారం అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూలై 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలో కేంద్రమంత్రి పర్యటన ఉన్నందున అధికారులు తమ శాఖల పూర్తి సమాచారం సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం డేవిడ్‌లతో కలిసి త్వరలో జిల్లాలో పర్యటించనున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహరాల శాఖ మంత్రి హర్ష మల్హోత్ర కార్యక్రమంపై బుధవారం అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాల అమలుపై సమీక్షించనున్నారని చెప్పారు. అస్పిరేషనల్ బ్లాక్‌లో భాగంగా ప్రధానమంత్రి జన్‌మన్, ప్రధాన మంత్రి జుగా పథకం అమలుపై అదికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటన రెండు రోజుల పాటు జిల్లాలో ఉంటుం దని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉంటా యన్నారు. అధికారులు నివేదికలను జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి అందించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఎంప్లాయి మెంట్ ఎక్సేంజ్ తెలంగాణ గోడ ప్రతులను అవిష్కరించారు. సమావేశంలో అయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.