Share News

kumaram bheem asifabad- అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 10:57 PM

భారీ వర్ష సూచన నేపథ్యంలో రానున్న మూడు రోజులు అదికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, ఇతర ఉన్నతాదికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad-  అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): భారీ వర్ష సూచన నేపథ్యంలో రానున్న మూడు రోజులు అదికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, ఇతర ఉన్నతాదికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ఇన్‌చార్జి మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ప్రజా సంక్షేమం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న మూడు రోజులు అదికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని చెప్పారు. హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలోఉ్ల ముందస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్‌ లిఫ్టింగ్‌ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో ఎప్పటికపుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఐటీ సెక్టార్‌ ఉద్యోగులకు సంబంధించి ఆయాశాఖల అధికారులు తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమ త్తం చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసుశాఖ అధికారులతో జూం మీటింగ్‌ ద్వారా సమీక్షించారు. రాబోయే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌క లెక్టర్‌ శ్రద్ధశుక్ల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

రుణ సదుపాయం కల్పించాలి..

జిల్లాలోని వ్యవసాయ, స్వయం సహాయక సంఘాలు, ఇతర రంగాల అభివృద్ధిలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఏజీఎం చేతన్‌ గోరేకార్‌లతో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి త్రైమాసిక కమిటీ సమావేశానికి హాజరై మాట్టాడారు. రైతులకు ప్రభుత్వం నిర్థేశించిన ప్రకారం రుణాలు అందించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ప్రక్రియ పూర్తి చేసి రుణాలు అందించాలని సూచించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో శిక్షణ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి రుణాలు అందజేయాలని చెప్పారు. చిన్నచిన్న కారణాలతో దరఖాస్తులను తిరస్క రించకూడదని సూచించారు. అభ్యర్థులకు సమాచారం అందించి అవసరమైన పత్రాలను తీసుకొని రుణ మంజూరీ జరిగేలా చూడాలని తెలిపారు. సమావేశంలో లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ రాజేశ్వర్‌జోషి, డీఆర్‌డీవో దత్తారావు, నాబార్డు డీడీఎం వీరభద్రుడు, బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 10:57 PM