Share News

అవినీతికి సహకరిస్తున్న అధికారులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 11:10 PM

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు చేస్తున్న అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు భవి ష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అవినీతికి సహకరిస్తున్న అధికారులు

మంచిర్యాలలో కబ్జాలు, దాడులతో అరాచక పాలన

మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు చేస్తున్న అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు భవి ష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎల్‌ఐసీ కాలనీలోని ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంచిర్యాల కార్పొరేషన్‌ కమిషనర్‌ విధుల నుంచి వెళ్లిపోవడానికి ఇక్కడి ఎమ్మెల్యే అవినీతే కారణమని ఆరోపించారు. మంచిర్యాలలో ఎటు చూసి నా భూకబ్జాలు, దాడులతో, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రానున్న రోజుల్లో కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పా రు. ప్రతి పక్షంలో ఉన్న తాను ఈ ప్రాంత నాయకులను, కార్యకర్తలను, ప్రజలను కాపాడుకోవడం బాధ్యత అన్నారు. భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఏర్పాటైన మరుక్షణం సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామన్నారు. పోలీసు అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవ హరిస్తూ తమపై కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్‌ నాయకులు ఎలాంటి విధ్వంసం చేసినా కేసులు నమోదు చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంద న్నారు. రానున్న ఎన్నికల్లో ప్రేంసాగర్‌రావు ఓడిపోతే హైద్రాబాద్‌కు పరి మితమవుతాడని, ప్రస్తుతం తప్పు చేసిన అధికారులు మాత్రం ఈ ఇక్కడే ఉంటారని, ఇది గమనించి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ ఎస్‌ మంచిర్యాల, నస్పూర్‌ పట్టణాధ్యక్షుడు గాదె సత్యం, అక్కూరి సుబ్బ న్న, నాయకులు తిరుపతి, వడ్లకొండ రవి, సుధీర్‌, అత్తి సరోజ, పల్లె భూ మేష్‌, రవీందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2025 | 11:10 PM