అధికార పార్టీ అండదండలతో కబ్జాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:19 PM
నస్పూర్‌లో గతంలో వివిధ ప్ర భుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములను అధికార పార్టీకి చెం దిన నేత అండదండలతో కబ్జాల దందా కొనసాగుతుందని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అరోపించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
నస్పూర్, అక్టోంబరు 10 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌లో గతంలో వివిధ ప్ర భుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములను అధికార పార్టీకి చెం దిన నేత అండదండలతో కబ్జాల దందా కొనసాగుతుందని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అరోపించారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న స్పూర్ శివారులోని సర్వే నంబరు 42లో గతంలో తహసీల్దార్, ఆదాయ పన్ను శాఖల కార్యాలయాలకు భూమి కేటాయించామన్నారు. కానీ అధికా ర పార్టీకి చెందిన నేత అండదండలతో కోట్ల విలువైనా భూములను కా జేయాలని కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సబ్ స్టేషన్ అనుకు ని టీఎన్‌జీవోఎస్‌కు కేటాయించిన దాదాపు 30 గుంటల భూమిని చదును చేసి మట్టిపోసి విక్రయించే ప్రయత్నాలు సాగుతున్నారు. కోట్లాది రూపా యల విలువైన భూములను కబ్జాదారులు కొల్లగోట్టేస్తుంటే రెవెన్యూ యం త్రాంగం చోద్యం చూస్తోందన్నారు. కబ్జాదారులను గుర్తించకుండా రెవెన్యూ, పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని దివాకర్‌రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూల్చి వేతలు చేసి ప్రజలను భయం గుప్పిట్లోకి నెట్టి సొమ్ము చేసుకుం టున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనుల చేప ట్టి ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు కేటాయించిందన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి కబ్జాలను ప్రొత్సహిస్తున్నా రని ఆరోపించారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోనే భూ దందా సాగు తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అనంతరం నస్పూర్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన భూములను కాపాడాలని కోరు తూ కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజేశ్వర్‌కు నాయకులు వినతి పత్రం అం దించారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, నాయకులు బండి రమేష్, వంగ తిరుపతి, రాజేంద్ర పాణి, సురేందర్‌రెడ్డి, రామస్వామి, సత్యనారాయణ, జనార్థన్, జక్కుల కుమార్, తిరమల్ రావు, తదితరులు పాల్గొన్నారు.