కబ్జానా...? -రక్షణ చర్యలా...!
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:36 PM
మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో పాఠశాల నిర్మా ణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
-స్థలం చుట్టూ ఫెన్సింగ్ వెనుక మతలబేమిటి
-భూమిని కబ్జా చేసేందుకేనంటున్న కాలనీవాసులు
-స్థలాన్ని కాపాడేందుకే రక్షణ చర్యలంటున్న డెవలపర్స్
-చర్చనీయాంశమైన రూ. కోట్లు విలువ చేసే భూమి
-హైటెక్ సిటీలో స్కూల్ కోసం కేటాయించిన స్థలంపై కన్ను
-ఇతరత్రా నిర్మాణాలు చేపట్టరాదంటూ బోర్డు ఏర్పాటు
మంచిర్యాల, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మంచి ర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో పాఠశాల నిర్మా ణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. రూ. 20 కోట్ల వరకు ఖరీదు చేసే ఎకరం స్థలాన్ని కబ్జా చే స్తున్నారంటూ హైటెక్‌సిటీ కాలనీ సంక్షేమ సంఘం ఆ ధ్వర్యంలో ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం తోపాటు మున్సిపల్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లకు సైతం సమాచారం అందించారు. స్పందించిన మున్సిపల్ అధి కారులు సదరు స్థలం కాలనీ డెవలపర్స్ పాఠశాల ఏ ర్పాటు కోసం మున్సిపాలిటీకి కేటాయించారని, అందు లో స్కూల్ బిల్డింగ్ మినహా, ఇతరత్రా నిర్మాణాలు చేపడితే మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం చర్యలు తీసుకుంటాం అని పేర్కొంటూ కమిషనర్ పేరుతో బో ర్డు ఏర్పాటు చేశారు.
ఖరీదైన స్థలం కావడంతో...
2006లో హైటెక్‌సిటీ వెంచర్ ఏర్పాటు సమయంలో లే అవుట్ నిబంధనల మేరకు డెవలపర్స్ ఎకరం స్థ లాన్ని స్కూల్ బిల్డింగ్ నిర్మాణం కోసం కేటాయించారు. సర్వే నంబర్లు 366,367,368, 371 నుంచి 392, 397, 399, 405లో మొత్తం 68.95 ఎకరాల భూమికి లే అవు ట్ అనుమతులు పొందారు. ఇందులో పైన పేర్కొన్న ఎకరాన్ని ప్రత్యేకంగా పాఠశాలకు కేటాయించారు. హైటెక్‌సిటీ నగర నడిబొడ్డున ఉండటం, కాలక్రమేణ కాలనీకి ప్రాధాన్యత పెరగడంతో అక్కడి ప్లాట్ల ధరలకు కూడా డిమాండ్ ఏర్పడింది. హైటెక్‌సిటీలో ఎక్కడ చూ సినా చదరపు గజం కనీసం రూ. 50వేల పైచిలుకు ధ ర పలుకుతోంది. హైటెక్‌సిటీలో నిర్మించిన హరిహర క్షే త్రం దేవాలయం వెనుకాల ఉన్న ఎకరం స్థలాన్ని పా ఠశాలకు కేటాయించినట్లు లే అవుట్ ప్లాన్‌లోనూ పొం దుపరిచారు. కాలనీ భూముల ధరలు ఆకాశాన్ని అం టుతుండటంతో పాఠశాల స్థలంపై అక్రమార్కుల కళ్లు పడుతున్నాయి. ఇంతకు ముందు ఇదే స్థలాన్ని అక్ర మంగా కబ్జా చేసిన కొందరు అందులో ప్లాట్లు ఏర్పాటు చేస్తూ హద్దురాళ్లు సైతం పాతారు. సమాచారం అందు కున్న మున్సిపల్ అధికారులు హద్దు రాళ్లను తొలగించి, స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు స్థలం చుట్టూ పాత ఫెన్సింగ్ ఉండగానే, కొత్తంగా సిమెంట్ స్తంభాలు పాతి రేకులు ఏర్పాటు చేసేందుకు యత్నించారు. స్థలంలో పెరిగిన మొక్కలను కొట్టివేశారు. భూమి చుట్టూ పాత ఫెన్సింగ్ ఉండగానే, కొత్తగా పోల్స్ పాతి ఐరన్ షీట్స్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా స్థ లాన్ని ఆక్రమించే యత్నం చేసిన వారిపై చర్యలు తీసు కోవడంతోపాటు స్థలంలో పాతిన పోల్స్‌ను వెంటనే తొ లగించడం ద్వారా పాఠశాల భూమిని కాపాడాలని కో రుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అం దుకున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఇలా....
మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో లే అవుట్ వెంచర్లు ఏర్పాటు చేసేవారు పలు నిబంధనలను అ మలు పరచాల్సి ఉంటుంది. తెలంగాణ మున్సిపాలిటీ ల చట్టం -2019, పంచాయతీ చట్టం- 2018 ప్రకారం మొత్తంలో లే అవుట్ స్థలం నుంచి 10 శాతం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం తోపాటు మరో 30 శాతం ప్రజల అవసరాలకు విని యోగించాల్సి ఉంటుంది. ఆ 30 శాతంలో మంచినీటి ట్యాంకులు, పాఠశాల, గుడి, తదితర ప్రజోపకర పను లు మాత్రమే చేపట్టాల్సి ఉంది. అందుకు భిన్నంగా హైటెక్‌సిటీలో స్కూల్ నిర్మాణానికి కేటాయించిన స్థలా న్ని ఇతర పనులకు వినియోగించే ప్రయత్నం చేయ డం వివాదాస్పదమైంది. దాదాపు 20 సంవ్సరాల పాటు స్థలం ఖాళీగా ఉండటంతో సహజంగానే దానిపై ఇత రుల కళ్లు పడుతున్నాయన్న అభిప్రాయాలను కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అ ధికారులు స్థలం చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేసి, కబ్జాలకు గురికాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
పాఠశాల నిర్మాణం కోసమే....హైటెక్‌సిటీ డెవలపర్ అంజద్
హైటెక్‌సిటీలో స్కూల్ కోసం కేటాయించిన ఎకరం స్థలంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టేందుకు సన్నా హాలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే మొదట స్థలం చుట్టూ ఇనుప రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు సదరు స్థలంలో పాఠశాల కోసం భవన నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో అందుకు అవసరమైన అనుమతులన్నీ తీసుకున్న తరు వాత పనులు ప్రారంభిస్తాం.
ఇతరత్రా నిర్మాణాలు చేపట్టరాదు...మున్సిపల్ కమి షనర్ సంపత్
మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం పాఠశాలకు కేటాయించిన స్థలంలో ఇతరత్రా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధం. సదరు స్థలంలో కేవలం పాఠశాల భవ నం నిర్మాణం మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. గతంలో కొందరు స్థలంలో అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు కోసం యత్నించారు. ఆ చర్యలను అడ్డుకున్నాం. భవిష్యత్తులో ఎవరు కబ్జాకు యత్నించినా తీవ్ర పరిణామాలు ఎదు ర్కోక తప్పదు.