Share News

ఐటీ హబ్‌ ఏర్పాటుకు ఆదిలోనే ఆటంకాలు...!

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:36 PM

మం చిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో ఏర్పాటు చేయదలచిన ఇండస్ట్రియల్‌ హబ్‌కు ఆదిలో నే ఆటంకాలు ఎదురయ్యాయి.

ఐటీ హబ్‌ ఏర్పాటుకు ఆదిలోనే ఆటంకాలు...!

-తమ భూములు ఇచ్చేందుకు రైతుల అభ్యంతరం

-నిబంధనల మేరకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌

-నోటిఫికేషన్‌ లేకుండానే భూముల స్వాధీనానికి సన్నాహాలు

-అధికారుల వైఖరికి నిరసనగా కోర్టును ఆశ్ర యించిన బాధితులు

-చట్ట ప్రకారం భూ సేకరణ జరపాలని హైకోర్టు ఉత్తర్వులు

మంచిర్యాల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మం చిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లిలో ఏర్పాటు చేయదలచిన ఇండస్ట్రియల్‌ హబ్‌కు ఆదిలో నే ఆటంకాలు ఎదురయ్యాయి. సుమారు 292 ఎక రాల స్థలంలో ఇండస్ట్రియల్‌ హబ్‌, ఐటీ పార్కు ఏర్పా టు చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు తరుచుగా చెబుతూ వస్తున్నారు. ఈ వి షయమై ఇప్పటికే సంబంధిత రైతుల నుంచి భూ ములు స్వాధీనం చేసుకోగా, పరిశ్రమలు స్థాపించే వ్యాపారులకు స్థలాలను అప్పగించడమే మిగిలి ఉం ది. ఇండస్ట్రియల్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చే యడానికి పెట్టుబడి దారులు, వ్యాపారులను ఆహ్వా నించే క్రమంలో జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేంసా గర్‌రావు, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ల నేతృత్వంలో పరి శ్రమలశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రత్యేక స మావేశం ఏర్పాటు చేశారు. భూ సేకరణ జరిగినం దున వ్యాపారులు ముందుకు వస్తే భూములు కేటా యిస్తామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవస రమైన విద్యుత్‌, నీటి సౌకర్యం, రహదారుల ఏర్పా టు, తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు.

అధికారుల సంసిద్ధత..

వేంపల్లి గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్‌లు 155, 156, 157,158, 159, 160లలోని అసైన్డ్‌ భూములతోపాటు, పోచంపాడు శివారులోని సర్వే నెంబర్లు 1,2,8,9,10లలోని సీలింగ్‌ భూములు మొ త్తం 276.09 ఎకరాలను ప్రభుత్వ స్ధలాన్ని ఇండస్ట్రి యల్‌ పార్కు కోసం సేకరించాలని టీఐఐసీఎల్‌ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఆదేశాలతో అధికారులు అవసరమైన చ ర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సదరు భూములను ఆగస్టులో డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ మ ల్సూర్‌, టీజీఐఏసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్ర వర్తితోపాటు జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి సంసిద్ధత కూడా తెలియజేశారు. అయితే భూ సేక రణ చట్టం ప్రకారం ముందుగా నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం భూ సేకరణ జరపాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా అధికారులు రైతుల నుంచి నే రుగా భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియకు తె రలేపారు. దీంతో వివాదం నెలకొంది.

పేదలకు కేటాయించిన ప్రభుత్వం..

సదరు స్థలం గతంలో కొందరు భూమి లేని నిరు పేదలకు సాగు నిమిత్తం ప్రభుత్వం అసైన్డ్‌ చేసింది. ప్రభుత్వం నుంచి భూములు పొందిన లబ్ధిదారుల పేరిట అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం సా గు హక్కులు కల్పించింది. 1977లో అమల్లోకి వచ్చిన అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన భూములను హక్కుదారులు కేవలం సాగు మాత్రమే చేయాల్సి ఉంది. క్రయ, విక్రయాలు జరి పేందుకు వీలులేదు. ప్రత్యేక పరిస్థితుల్లో విక్రయాలు చేయాలనుకుంటే అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం అర్హ తగల వారు మాత్రమే సాగు కోసం కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. అయితే సదరు భూముల్లో అ నేక మంది లబ్ధిదారులు ఇప్పటికీ సాగు చేస్తుండగా, కొంత మొత్తం మాత్రం అన్యాక్రాంతం అయిందనే ఆరోపణలున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన బాధితులు...

ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయబోయే భూ ముల లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులపై అభ్యం తరాలు నెలకొన్నాయి. ప్రభుత్వపరంగా అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం పట్టాలు పొంది ఉన్నందున ప్రస్తుత బహిరంగ మార్కెట్‌ ప్రకారం పరిహారం చెల్లించాల ని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే విషయ మై ఎమ్మెల్యే లబ్ధిదారులతో గతంలో సమావేశం ఏర్పాటు చేసి ఎకరాకు రూ. 13 లక్షలు పరిహాం చెల్లి స్తామని హామీ ఇవ్వడంతో లబ్ధ్దిదారులు ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం భూముల ధర మార్కెట్‌ వి లువ ప్రకారం ఎకరాకు సగటున రూ. 6.5 లక్షల వరకు ఉంది. భూ సేకరణ జరిపే స్థలాకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మార్కెట్‌ విలువకు మూడు రె ట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు పరిహారం చె ల్లించాలనే నిబంధన ఉంది. దీంతోపాటు వంద శా తం సులేటియం చెల్లించాల్సి ఉంటుంది. భూ సేకర ణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులు ససేమి రా అనడంతో ఈ విషయమై పలువురు రైతులు హై కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

భూసేకరణ చట్టం ప్రకారమే సేకరించాలి...

బాధితుల పిటిషన్‌ను విచారించిన రాష్ట్ర హైకోర్టు వారిని ఇబ్బంది పెట్టవద్దంటూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్‌ ఇవ్వకుండా భూ సేకరణ ఎలా చేస్తారని హై కోర్టు ప్రశ్నించింది. నేరుగా భూ ములు స్వాధీనం చేసుకోవడం భూ సేకరణ చట్ట విరుద్ధమని, తద్వారా ప్రజల జీవించే హక్కు, వాక్‌ స్వాతంత్రపు హక్కు, ఆస్తి హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనా ల కోసం భూ సేకరణ చేయాల్సి వస్తే 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి చేయాలని పేర్కొం టూ ప్రతివాదులుగా ఉన్న కలెక్టర్‌, ఆర్డీవో, తహసీ ల్దార్‌లను ఆదేశించింది. హై కోర్టు ఆదేశాల మేరకు అధికారులు భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు ప్రక్రియ ముందుకు వెళుతుందా...? లేదా...? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 10 , 2025 | 11:36 PM