Share News

kumaram bheem asifabad- ఎస్పీఎం ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలకు అడ్డంకులు

ABN , Publish Date - Nov 07 , 2025 | 10:22 PM

సిర్పూ రు పేపర్‌ మిల్లు(ఎస్పీఎం)లో ట్రేడ్‌ యూనియన్‌ ఎ న్నికల ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచి పోయే పరిస్థితి నెలకొంది. యూనియన్ల అర్హతపై అభ్యంతరాలు తెలుపుతూ మేనేజ్‌మెంటు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గత నెల 28న ఆదిలాబాద్‌ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ రాజేశ్వరి వద్ద ట్రేడ్‌యూనియన్‌ ఎన్నికల నిర్వహించేందుకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎస్పీఎం ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎస్పీఎం యాజమాన్యం మాత్రం హాజరు కాలేదు.

kumaram bheem asifabad- ఎస్పీఎం ట్రేడ్‌ యూనియన్‌  ఎన్నికలకు అడ్డంకులు
సిర్పూరు పేపర్‌ మిల్లు

- మండిపడుతున్న కార్మికసంఘాలు

- ఈ నెల 17న విచారణ

కాగజ్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సిర్పూ రు పేపర్‌ మిల్లు(ఎస్పీఎం)లో ట్రేడ్‌ యూనియన్‌ ఎ న్నికల ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచి పోయే పరిస్థితి నెలకొంది. యూనియన్ల అర్హతపై అభ్యంతరాలు తెలుపుతూ మేనేజ్‌మెంటు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గత నెల 28న ఆదిలాబాద్‌ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ రాజేశ్వరి వద్ద ట్రేడ్‌యూనియన్‌ ఎన్నికల నిర్వహించేందుకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎస్పీఎం ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎస్పీఎం యాజమాన్యం మాత్రం హాజరు కాలేదు. డిసెంబరులో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని రౌండ్‌టేబుల్‌ సమావేశంలో స్పష్టంగా తేల్చింది. మిల్లులో ఎంత మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు వారి జాబితా నవంబరు 3లోగా తమకు అందజేయాలని నోటీసును కూడా పంపించింది. కాని యాజమాన్య మాత్రం ట్రేడ్‌ యనియన్ల అర్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు అనిశ్చితి ఏర్పడింది. బిర్లా యాజమాన్యం నుంచి జేకే సంస్థకు మార్పిడి జరిగిన తర్వాత కార్మికులపై పని ఒత్తిడి, స్థానికులకు అవకాశం లేకుండా చేసినట్టు, స్థానికేతరులను విధుల్లోకి తీసుకొని అధిక జీతాలిస్తూ పనులు చేయిస్తున్నట్టు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు బాహాటంగా యాజమాన్యం తీరుపై మండి పడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా వేతనం ఒప్పందం చేసినట్టు, ప్రొడక్షన్‌ బోనస్‌లో కోత విధించినట్టు, సెలవులు 30 నుంచి 26 కుదించఛిం నిర్ణయాలు తేల్చాలని డీసీఎల్‌కు పలువురు ఫిర్యాదు కూడా చేశారు. మిల్లు పునరుద్ధరణ జరిగిన తర్వాత కార్మికులపై పని భారం చేయటం, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన సవరణ కాక పోవడంతో అపార నష్టం జరుగుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు.

- యాజమాన్యం నిర్ణయాలతో..

యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల నిర్వహణ అనివార్యమని కార్మికుల్లో ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. మిల్లులో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు జరిగితే ప్రతి అంశం యాజమాన్యంతో తేల్చుకునే అవకాశాలున్నాయి. యాజమాన్యం వ్యూహాత్మకంగా హైకోర్టును ఆశ్రయించటంతో ఎన్నికల ప్రక్రియ నిలిచి పోయే అవకాశం ఉంది. ఈ నెల 17న జరిగే విచారణలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల భవితవ్యం తేలనుంది. హైకోర్టులో కూడా సీఐటీయూ సంఘం రిట్‌పిటిషన్‌ వేసింది. అలాగే సిర్పూరు పేపర్‌ మిల్‌ ట్రేడ్‌ యూనియన్‌ నంబరు 966 ప్రతినిధులు ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు కూడా ఎస్పీఎంలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టులో కూడా రిట్‌ పిటిషన్‌ వేశారు. యాజమాన్యం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని వెంటనే ఎన్నికలు నిర్వహించేట్టు చూడాలని ఈ పిటిషన్‌లో దాఖలు చేశారు. మిల్లులో కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఉంటుందని, అలాగే తరుచూ ప్రమాదాలు జరిగినప్పటికీ పరిహారం ఎం త ఇస్తారన్న విషయం ఇంత వరకు అధికారికంగా యాజమాన్యం ప్రకటించటం లేదు. ప్రమాదాలు జరిగితే కనీసం యాక్సిడెంట్‌ రిపోర్టు కూడా ఇవ్వటం లేదని కార్మికులు పేర్కొంటున్నారు. 2022 అగ్రిమెం టు ఒప్పందం నిబంధనలకు విరుద్దంగా జరిగినట్టు, లేబర్‌ అధికారుల సంతకం లేనే లేదని ట్రేడ్‌యూనియన్‌ నాయకులు యాజమాన్యం తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లులో క్యాంటిన్‌ సౌకర్యం లేక పోవటం, సెలవుల కుదింపు, ప్రొడక్షన్‌ బోనస్‌పై పది శాతం చేయటం అంశాల్లో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలతోనే ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల కోసం దారి వేసినట్టు, ఎన్నికలు జరిగితే తమకు న్యాయం జరుగుతుందని కార్మికులు అంతా డిమాండు చేస్తున్నారు. ఎన్నికల జరిగితే భవిష్యత్తు వివిధ నిర్ణయాలు తీసుకునే అవకాశలుండవన్న ఉద్దేశ్యంతో యాజమాన్యం హైకోర్టులో కేసు వేసి ఎన్నికల ప్రక్రియ బ్రేక్‌ వేసేలా చేశారని పలువురు చెబుతున్నారు. ఈ నెల 17న జరిగితే విచారణలో పూర్తి అంశాలు తేలనున్నాయి.

Updated Date - Nov 07 , 2025 | 10:22 PM