kumaram bheem asifabad- సాదా బైనామాలకు తొలగిన అడ్డంకులు
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:08 PM
సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగా యి. ఐదున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన జీవో 112 స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావడంతో పాటు ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు సమర్పించింది.
- క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం అర్హులకు పట్టాదారు పుస్తకాలు
- భూ భారతి సదస్సులో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు
కాగజ్‌నగర్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగా యి. ఐదున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన జీవో 112 స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకరావడంతో పాటు ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారంపై విధివిధానాలను హైకోర్టుకు సమర్పించింది. ఈ మేరకు హైకోర్టులో ఉన్న పిల్‌ను కొట్టేసింది. ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు అడుగులు వేస్తోంది. 2020 నుంచి పెండింగ్ దరఖాస్తులు, భూ భారతి సదస్సులో వచ్చిన దరఖాస్తులు 1,500లకుపై ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. ఏళ్లుగా రైతులు సాదా బైనామాల సమస్య ప్రధానంగా ఎదుర్కొంటు న్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదాబైనామాల సమస్యలను పరిష్కరించేందుకు 2016లో జీవో 153ను తీసుకవచ్చింది. 2014 జూన్ 2 తేదీకి ముందు సాదాబైనామాలతో భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. 12 అక్టోబరు 2020లో కూడా జీవో12ను జారీచేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన సాదాబైనామాల ప్రక్రియ ముందు కు సాగలేదు. సాదాబైనామాల సమస్యపరిష్కారం కాకుండానే 20 అక్టోబరు 2020లో జీవో 112 ద్వారా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల చట్టాన్ని తెచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నిర్మల్‌కు చెందిన దేవిదాస్ హైకోర్టులో పిల్ దాఖాలు చేశారు. దీంతో హైకోర్టు జీవో అమలును నిలిపివేస్తూ 2020 నవంబరు 11న మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం సాదా బైనామాకు చట్టబద్ధత కల్పిస్తుందన్న ఆశతో అప్పటికే కొంత మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవి పెండింగ్‌లోనే ఉన్నాయి. కానీ తాజాగా హైకోర్టుకు రాష్ట్ర ప్ర భుత్వం భూ భారతి చట్టంలో తీసుకునే అంశాల ను, సాదాబైనామాలకు చట్టబద్ధత ప్రక్రియ చేసే అంశాలను కూలంకషంగా సమర్పించడంతో హైకో ర్టు పిల్‌ను కొట్టేసింది. దీంతో హైకోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో సాదాబైనామాలకు పట్టాలిచ్చేందుకు చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ దిశగా అధికారులకు కూడా మండలాల వారీగా పెండింగ్ లో ఉన్నవి ఎన్ని, కొత్తగా భూ భారతి చట్టం ద్వారా ఎన్ని వచ్చాయి అనే వివరాలను పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
- భూ హక్కుల కోసం..
రైతాంగం తమ భూ హక్కుల కోసం కార్యాయా ల చుట్టు తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2020లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు భూ హక్కులను కల్పించే పట్టాదారు పాసు పుస్తకం 1971ని రద్దు చేసి కొత్త పాస్ పుస్తకాలు 2020 ధరణిని తీసుకవచ్చింది. కానీ సాదాబైనామాలతో పాటు అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ధరణిలో చోటు కల్పించలేదు. అలాగే గ్రామ రెవిన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయడంతో రైతులకు మరిన్ని కష్టాలు పెరిగాయి. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటిగా ఉన్న సాదాబైనామా గతంలో చాలా మంది రైతులు తెల్లకాగితాలపై, రెవిన్యూ స్టాంపులపై క్రయవిక్రయాలు చేశారు. ఇవీ అధికారికంగా కాక పోవడంతో బ్యాంకుల్లో వీరికి రుణాలు కూడా చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెవెన్యూ గ్రామ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఈ సదస్సుల్లో అధికంగా సాదాబైనామాలు, అసైన్ట్ భూముల సమస్యలు అధికంగా వచ్చాయి. సాదాబైనామాలపై మధ్యం తర స్టే ఉత్తర్వు ఎత్తివేయడంతో వీటికి లైన్ క్లియర్ అయింది. కాగా సాదాబైనామాల దరఖాస్తులు అర్హులను గుర్తించేందుకు అధికారులు గతంలో కొన్ని చేపట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధూకర్‌ను వివరణ కోరగా సాదాబైనామాల దరఖాస్తుల విషయంలో ఇం త వరకు అధికారింగా ఉత్తర్వులు రాలేదన్నారు. ఉత్తర్వులు వస్తే పెండింగ్ దరఖాస్తులను పరిశీ లించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.